పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో ఈమేరకు ఆయా సినిమాలకు డేట్స్ కేటాయించారు. ఈ క్రమంలో ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్.. తాజాగా ‘ఓజీ'(OG) సినిమాను కూడా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు ఈ మూవీ షూటింగ్ ఇవాళ రీస్టార్ట్ అయినట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ప్రకటించింది. ‘మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించేద్దాం’ అంటూ ట్వీట్ చేసింది.
త్వరలోనే పవన్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. దీంతో వీలైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేసేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రెండేళ్ల క్రితం విడుదల చేసిన మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.