Pawan Kalyan OG: ఓజీ కథ కాపీనా, సుజీత్ ఇది నిజమేనా..? అవును తాజాగా ఓ కన్నడ దర్శకుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా ఫ్లాపైతే ఎవరూ దీని గురించి మాట్లాడరు. అదే, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం ఎవరో ఒకరు ఈ కథ నాదే అంటూ బయలు దేరతారు. ఇటీవల వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా కథ నా సినిమాను ప్రేరణగా తీసుకొనే తీశారని ఓ దర్శకుడు అంటున్నారు. అలా ఎందుకంటున్నాడో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా వచ్చింది ఓజీ. ఇందులో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ముందు నుంచి భారీ హైప్ ఉన్న ఈ సినిమాపై కొంత నెగిటివిటీ కూడా క్రియేట్ అయింది. గతంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ గా వచ్చిన బాలు, పంజా ఫ్లాపయ్యాయి. కాబట్టి, పవన్ కి ఈ తరహా కథలు సూటవవని మాట్లాడారు. కానీ, ఓజీ వచ్చి బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన సంచలనం అంతా ఇంతాకాదు.
Also Read- Samyuktha: టాలీవుడ్‌ను ఏలుతున్న మలయాళ బ్యూటీ – తొమ్మిది సినిమాలు లైన్‌లో పెట్టిందిగా!
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఓజీ అని చెప్పుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓజీ సినిమాను నేను తీసిన కబ్జా సినిమా కథను ఆధారంగా తీసుకొనే తీసినట్టుగా చెప్పుకొచ్చాడు. ఇది పవన్ ఫ్యాన్స్ కి మంటమండించే విషయం. ఎందుకంటే 2023 లో వచ్చిన కబ్జా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఇది నిరాశపరిచిన సినిమా.
ఇలాంటి కథను ఇన్స్పిరేషన్‌గా ఎలా తీసుకుంటారు..? అనేది ఒక పాయింట్ అయితే..ఓజీ కి అంతకముందునుంచే కథ చర్చలు మొదలయ్యాయి. మూడేళ్ళ నుంచి ఈ సినిమా గురించి వార్తలు రావడం..ప్రాజెక్ట్ మొదలవడం అందరికీ తెలిసిందే. మరి, ఆర్ చంద్రు చేసిన కామెంట్స్ ని ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవరూ ఒప్పుకోలేరు. కాబట్టే, ఆయన మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. మరి, ఈ కామెంట్స్ పై సుజీత్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా, కబ్జా మూవీలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, శ్రీయ శరణ్ కీలక పాత్రల్లో నటించారు.


