Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG Ticket Rates: సాధారణ ప్రేక్షకుడికి గుడ్ న్యూస్.. తగ్గిన OG టికెట్ రేట్స్

OG Ticket Rates: సాధారణ ప్రేక్షకుడికి గుడ్ న్యూస్.. తగ్గిన OG టికెట్ రేట్స్

OG Ticket Rates: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సినిమా టికెట్ల ధరలు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం ఉంది. అయినప్పటికీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు మరింతగా పెంచుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచడానికి నిర్మాతలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయి. తెలంగాణలో కూడా కొన్ని సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశాలు లభిస్తున్నాయి. అస‌లే దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్స్‌కు రావ‌టం లేద‌ని అంద‌రూ భావిస్తోన్న త‌రుణంలో ఆక‌స్మాత్తుగా పెరుగుతోన్న టికెట్ రేట్స్ వారిని సినిమాల‌కు మ‌రింత దూరంగా చేస్తున్నాయి. ఇది సినిమా స‌క్సెస్‌పై మ‌రింత ప్ర‌భావాన్ని చూపిస్తోంది.

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్ తాజా బిగ్ మూవీ ‘ఓజీ (OG)’ విషయంలో కూడా ఇదే జరిగింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా న‌టించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. అయితే టికెట్ రేట్స్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. ముందురోజు వేసిన ప్రీమియర్ షోల టికెట్లు అయితే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ధరలకు అమ్మారు. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభపడినా, ఎక్కువ ధరలు వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.

పెంచేస్తోన్న టికెట్ ధ‌ర‌ల కార‌ణంగా మంచి సినిమాల‌కు, సాధార‌ణ టికెట్ రేట్స్ ఉన్న సినిమాల‌కు కూడా ఆడియెన్స్ దూరంగా ఉంటున్నారు. ఎక్కువ ధరల కారణంగా చాలా మంది సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతున్నారు. ఫుట్‌ఫాల్స్ (థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య) తగ్గిపోవడం సినిమాకు నష్టం చేస్తుంది అని అనేకమంది అంటున్నారు. గతంలోనూ టికెట్ ధరలు ఎక్కువగా వసూలు చేసిన కొన్ని సినిమాలు నష్టాల్లో పడగా, తక్కువ ధరలు పెట్టిన సినిమాలు మంచి లాభాలు తెచ్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి.

Also Read – Varalakshmi Saratkumar: ఈ యాంగిల్ కూడానా..?

ఓజీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. మొదటి వారం వ‌ర‌కు రేట్లు ఎక్కువగా ఉన్నా, వీకెండ్ తర్వాత రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉన్నది. సోమ‌వారం నుంచి జనాలు నేచురల్‌గా తగ్గుతారు కాబట్టి టికెట్ ధరలు తగ్గించి మరింత మందిని థియేటర్లకు రప్పించడం మంచి ఆలోచ‌న అవుతుంది. ద‌స‌రా సెల‌వులు ప్రారంభమవుతున్న ఈ టైంలో అందుబాటులో ఉన్న ధరలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమ‌నే చెప్పాలి. తూర్పు గోదావ‌రి జిల్లాలో ఇప్పటికే రూ.200 యూనిఫాం టికెట్ రేటు అమలు చేసి అక్కడి ప్రేక్షకుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇదే విధంగా అన్ని ఏరియాలల్లో కూడా ఈ ఆలోచన తీసుకురావచ్చు.

మొత్తానికి, ‘ఓజీ’ రెండో వారం దాకా స్టడీగా రన్ కావాలంటే, టికెట్ ధరలు త‌గ్గించి, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే మంచిదన్న విషయం డిస్ట్రిబ్యూటర్లకి అర్థమవుతోంది. గతంలో ‘మిరాయ్’ సినిమాకు వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇప్పుడు టికెట్ రేట్స్ త‌గ్గుద‌ల అనేది ఓజీకి ఎంత మేర ప్ల‌స్ అవుతుందో చూడాలి మ‌రి.

Also Read – Ram Charan: 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గ్లోబల్‌ స్టార్‌’.. ‘పెద్ది’ నుంచి సర్‌ప్రైజ్‌ పోస్టర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad