Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభHHVM Collections: ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పవర్ చూపించిన పవన్ కళ్యాణ్

HHVM Collections: ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పవర్ చూపించిన పవన్ కళ్యాణ్

Hari Hara Veera Mallu Collections: రాజకీయాల్లో జన సేనాని, సిల్వర్ స్క్రీన్‌పై పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా సినిమా ‘హరి హర వీరమల్లు’. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నటించిన మొదటి చిత్రం ఇది. ఆయకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో చక్రం తిపుతున్న తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగింది. రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ హరి హర వీరమల్లు సినిమా కోసం డేట్స్ కేటాయించి కంప్లీట్ అయ్యేలా చూసుకున్నారు. ఈ కారణంగా ఆయన అభిమానులు, సినిమా ప్రేమికులు ఈ సినిమాకి చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

- Advertisement -

‘హరి హర వీరమల్లు’ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకూ వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై హైప్‌ ను పెంచాయి. పవన్ నటించిన తొలి పీరియాడిక్ మూవీ ఇది. హిస్టారికల్ కాన్సెప్ట్ టచ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఉంది. అయితే మొఘల్ చక్రవర్తి దగ్గర ఉన్న సమయంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. హరి హర వీరమల్లు అనేది కల్పిత పాత్ర. దాదాపు ఐదేళ్ల ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా చివరికి జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.

Also Read – Balakrishna: బాల‌య్య స్పీడు మామూలుగా లేదుగా! – క్రిష్‌తో నాలుగో సినిమా క‌న్ఫామ్‌

పవన్ కళ్యాణ్‌ని మళ్లీ మాస్ యాక్షన్ స్టైల్‌లో చూడడం అభిమానులకు ఎంతో ఆనందం ఇచ్చింది. సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ, పవన్ యాక్టింగ్ బావుందంటూ, సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటూ హడావుడి చేశారు. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయగా, విడుదలైన రోజు (గురువారం) ఉదయం షోలు, మ్యాట్నీ షోలు అన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. భారీ హైప్ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

మొదటి రోజే దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.31.50 కోట్లు (HHVM Collections) వసూలు చేసినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. ప్రీమియర్ షోల ద్వారా రూ.12.7 కోట్లు వసూలు చేసి, మొత్తం కలిపి రూ.43.8 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ రిలీజ్ రోజున సగటున 57.39% ఆక్యుపెన్సీ (HHVM Occupency) నమోదైంది. శని, ఆది వారాల్లోనూ సినిమాకు కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే సోమవారం రోజునే సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

Also Read – Longest Solar Eclipse: ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఇది మన దేశంలో కనిపిస్తుందా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad