HHVM Theatrical Business: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 24న గ్రాండ్ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఆయన తప్పుకోవటంతో జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం మూవీని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. సినిమా ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తర్వాత బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ విషయంలోనూ ఫ్యాన్సీ ఆఫర్స్ అందుకున్నారని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) థియేట్రికల్ బిజినెస్ ఎంత.. సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కావాలంటే ఎంత రాబట్టాలి? అనే దానిపై ఇప్పుడిప్పుడే ట్రేడ్ వర్గాలకు క్లారిటీ వచ్చేస్తోంది. నిర్మాత ఎ.ఎం.రత్నంకు డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో మూవీ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఏ ఏరియా ఏ మేరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందనే విషయానికి వస్తే.. నైజాం ఏరియా రూ.37 కోట్లకు అమ్ముడైంది. సీడెడ్ రూ.16.50 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.12 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.9.50 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.7 కోట్లు, గుంటూరు రూ. 9.50 కోట్లు, కృష్ణ రూ.7.60 కోట్లు, నెల్లూరు రూ. 4.40 కోట్లుగా అమ్ముడయ్యాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 103.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిసి రూ. 12.50 కోట్లు, ఓవర్సీస్ రూ.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే మొత్తంగా చూస్తే రూ.126 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా హిట్ కావాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ.127 కోట్లు షేర్ బిజినెస్ జరగాలి. అంటే గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం చూస్తే రూ.260 కోట్లు సినిమా సాధించాలని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.
Also Read – ISRO: మరో కీలకమైన ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో!
పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో ఇదే హయ్యస్ట్ థియేట్రికల్ బిజినెస్ అని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే రూ.260 కోట్లు బిజినెస్ జరగటం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఆ రేంజ్ హిట్ అయితే మాత్రం ఇక మేకర్స్‌కు తిరుగుండదు. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో సినిమా రూపొందింది. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు హరిహర వీరమల్లుగా ఇందులో పవన్ కనిపించబోతున్నారు. ఆయన కెరీర్‌లో రానున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. అలాగే తొలి పీరియాడిక్ యాక్షన్ మూవీ కూడా ఇదే. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ మూవీ కోసం క్లైమాక్స్ ఫైట్‌ను పవన్ కళ్యాణ్ డిజైన్ చేయటం విశేషం.
Also Read – Free Bus: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఫ్రీ బస్సు అప్పటి నుంచే!


