HHVM Remunarations: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూలై 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. మొన్నటివరకు ఈ సినిమాపై బజ్ అంతగా లేదు. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా హైప్ రెట్టింపు అయ్యింది. ప్రీ రిలీజ్‌తో పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు పవన్ అటెండ్ కావడంతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్లతో పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చారు. తొలి రోజు హరిహర వీరమల్లు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
పదకొండు కోట్లు మాత్రమే…
దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో హరిహర వీరమల్లు సినిమాను ఏఎమ్ రత్నం నిర్మించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 11 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 2022లోనే హరిహర వీరమల్లు సినిమా మొదలైంది. ఆ టైమ్‌లో అంగీకరించిన రెమ్యూనరేషన్‌కు కట్టుబడి ఈ సినిమాను పూర్తి చేసినట్లు సమాచారం. చివరగా పవన్ 2023లో రిలీజైన బ్రో మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కోసం 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
Also Read – Cobra Snakes Fighting: భయంకరమైన కింగ్ కోబ్రాల ఫైటింగ్ ఎప్పుడైనా చూశారా?
నిర్మాణంలో ఇబ్బందులు…
పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, డిప్యూటీ సీఏంగా పదవి చేపట్టడంతో హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యమైంది. సినిమా ఆలస్యానికి తాను ఓ కారణం కావడంతో రెమ్యూనరేషన్ విషయంలో ప్రొడ్యూసర్‌పై పవన్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని చెబుతున్నారు. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా ఆరంభం నుంచి పూర్తి చేసేవరకు అడుగడుగునా నిర్మాత ఏఎమ్‌రత్నం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
నిర్మాతకు సపోర్ట్…
డైరెక్టర్ క్రిష్ మధ్యలోనే సినిమా నుంచి వైదొలగడం, ముందుగా అనుకున్న నటీనటులు కొంతమంది సినిమా నుంచి తప్పుకోవడం, రిలీజ్ డేట్స్ మారడం… ఇలా సినిమా నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ కష్టాలన్నింటిని దాటుకొని ఏఎమ్‌రత్నం సినిమాను పూర్తిచేశారు. ఏఎమ్ రత్నం పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి చూసిన పవన్… నిర్మాతకు సపోర్ట్‌గా ఉండాలనే రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించకుండా హరిహర వీరమల్లు మూవీని కంప్లీట్ చేశారని సన్నిహితులు చెబుతోన్నారు. నిర్మాతపై ఉన్న ఆ సింపథీతోనే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌కు అటెండ్ అయినట్లు చెబుతున్నారు.
Also Read – Divya Bharathi: హాట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న జూనియర్ దివ్య భారతి
హీరోయిన్ రోల్ కోసం…
హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ హీరోయిన్ రోల్ కోసం నిధి అగర్వాల్ రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిసింది. విలన్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.
హరిహర వీరమల్లు మూవీకి క్రిష్‌తో కలిసి ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.


