Pawan Kalyan: నట దిగ్గజాలైన ఎన్టీఆర్ (NTR), ఎంజీఆర్ (MGR)ల నుండి ప్రేరణ పొంది, పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’లో (Hari Hara Veera Mallu) ఆయన పాత్రను రూపొందించినట్లు దర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా జ్యోతి కృష్ణ మాట్లాడుతూ… ఎన్టీఆర్ మరియు ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తులలో ఉన్న అద్భుతమైన లక్షణాలను పవన్ కళ్యాణ్‌లో గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని పేర్కొన్నారు. ప్రజా నాయకుడిగా పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) జనాల్లో ఉన్న ఇమేజ్, ప్రజల మనిషిగా ఆయనకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకొని ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను అత్యంత జాగ్రత్తగా రూపొందించారు దర్శకుడు.
Also Read – Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు
మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సందేశాత్మకంగా, విలువలతో కూడిన కూడిన సినిమాలు చేస్తూ తన నట జీవితాన్ని కొనసాగించడం దర్శకుడికి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది. అందుకే ‘హరి హర వీరమల్లు’లో ‘మాట వినాలి’ అనే శక్తివంతమైన, ఆలోచింపజేసే పాటను స్వరపరిచారు. ఈ పాట యొక్క సారాంశం పవన్ కళ్యాణ్ భావ జాలాన్ని ప్రతిబింబిస్తూ, జీవితంలో సానుకూలత, ధర్మాన్ని స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని దర్శకుడు జ్యోతికృష్ణ (Jyothy Krishna) తెలిపారు.
అదేవిధంగా నట సార్వభామ విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ నటన గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పలు పౌరాణిక, జానపద చిత్రాలతో మెప్పించారు. ముఖ్యంగా, రాముడు (Lord Rama), కృష్ణుడు (Lord Krishna) వంటి పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ తన శక్తిని, ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా పలు చిత్రాల్లో జ్యోతి కృష్ణ వివరించారు. ఈ అంశం నుండి ప్రేరణ పొంది, ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ కోసం విల్లు, బాణాన్ని రూపొందించారు.
Also Read – Jobs: నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
పవన్ కళ్యాణ్ యొక్క శక్తిని సూచించడానికి, న్యాయం కోసం పోరాడటానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకగా ఈ ఆయుధాలు రూపొందించబడ్డాయి. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కేవలం కథానాయకుడిగా కాకుండా ఒక నాయకుడిగా చూస్తున్నారని తాను గ్రహించానని దర్శకుడు జ్యోతికృష్ణ పేర్కొన్నారు. అందుకే కథనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలనుకున్నానని డైరెక్టర్ చెప్పారు. మరి సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూడాలి మరి.


