OG Success Meet: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ OG. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా ఇప్పటికే రూ.250 కోట్ల మార్క్‌ను దాటేసింది. బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో OG బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సినిమాను ఇబ్బంది పెడుతున్నటువంటి రివ్యూస్ మీద కూడా ఆయన తనదైన బాణీని వినిపించారు. ‘ఓ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో అప్పుడే ఫోన్ తీసుకుని రికార్డింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ సీన్ బావుందని, ఫలానా సీన్ బాగోలేదని అంటున్నారు. రెండున్నర గంటల సినిమా చూస్తేనే కదా.. బాగుందో లేదో తెలియటానికి. పెరుగుట విరుగుట కొరకే.. అందరూ సినిమా చూడటం మానేసి రివ్యూవర్స్‌లా తయారయ్యారు.
Also Read- Dasara 2025: విజయదశమి.. జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం అసలు విషయమేంటంటే!
అత్తారింటికి దారేది సినిమాను ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశారు. ఆ సినిమా సమయంలో నేను నష్టపోయిన దానికి కాటమరాయుడు వరకు వడ్డీలు కడుతూనే వచ్చాను. ఈ కల్చర్ పోవాలి.. లేకపోతే కోట్లు పెట్టే సినిమా నిర్మాతలు నష్టపోతారు. సినిమాను యూట్యూబ్‌లో పెట్టటమో, పైరసీ చేసేయటమో ఈజీ. కానీ మా కష్టం ఎవరికీ తెలియదు. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఆలోచించండి. సినిమాను చంపేయకండి. మీరు ఎంతో మంది పొట్ట కొడుతున్నారు. మీకు తెలియటం లేదు. మా ఉసురు మీకు తగులుతుంది. నిర్మాతలు పారిపోతున్నారు. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాకు నేను ఎంతో కష్టపడ్డాను. ఎప్పుడూ బయటకు రాని నేను ఆ సినిమా కోసం బయటకు వచ్చాను. సినిమాను మన మీద నమ్మకంతోనే వస్తారని నేను భావించాను. ఆటు పోట్లను ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నాను. అయితే ఓజీ నాకు బలాన్నిచ్చింది’ అన్నారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అందరూ రివ్యూవర్స్‌గా మారిపోతున్నారు. సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయటం లేదు. మొబైల్స్‌లో చిత్రీకరించటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కీలకమైన సన్నివేశాలు నెట్టింట బయటకు రావటం మేకర్స్‌ను ఎంతో ఇబ్బంది పెడుతోంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేసే నిర్మాతలకు ఇది ఇబ్బందికరమైన విషయమే. దీని గురించి ఆలోచించాలని పవన్ పేర్కొన్నారు.
OG విషయానికి వస్తే సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య సినిమాను నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా రూపొందనుంది.


