OG Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం OG. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ గ్యాంగ్ స్టర్ స్టోరీపై ఇప్పటికే రిలీజ్ కంటెంట్‌తో అభిమానుల్లో అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ లుక్ సహా ప్రతీది సినిమాకు మంచి బజ్ ని తీసుకొచ్చింది. హరి హర వీరమల్లు ఫ్లాప్ అయిన నేపథ్యంలో అభిమానులంతా ఓజీతో పవన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. సుజిత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించబోతున్నాడు.ఇదంతా బాగానే ఉంది. కానీ..ఓ బ్యాడ్ సెంటిమెంట్ పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి ఇబ్బందికరంగా ఉంది. ఇంతకీ వారిని ఇబ్బంది పెడుతోన్న సదరు బ్యాడ్ సెంటిమెంట్ ఏంటో తెలుసా!.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రెండు గ్యాంగ్‌స్టర్ చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 25న OGతో రాబోతున్నాడు. అయితే ఆయన గతంలో నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీస్ బాలు, పంజా. ఈ రెండు చిత్రాలు ఆయనకు డిజాస్టర్స్‌గానే మిగిలాయి. బాలు సినిమా విషయానికి వస్తే.. గ్యాంగ్ స్టర్ గా ఉన్న పవన్ తన ప్రియురాలి కోసం డాన్ పైనే తిరగబడతాడు. ఈ కథ అప్పట్లో చాలా మందికి కనెక్ట్ అవ్వలేదు, దీంతో బాక్సాఫీస్ వద్ద ఫలితం తారుమారుగా వచ్చింది. బాలు పరాజయం తర్వాత చాలా కాలం పాటు పవన్ మళ్లీ గ్యాంగ్‌స్టర్ చిత్రాల వైపు వెళ్లలేదు, వివిధ రకాల కథలు చేసుకుంటూ వచ్చారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/mani-ratnam-eyes-on-tollywood-to-comeback-with-geethanjali-2/
ఈ క్రమంలోనే విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన పంజాతో మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. పంజా కథ కూడా బాలు లాగే ఉన్నప్పటికీ, ఇందులో పాత్రల్ని స్టైలిష్ గా ఎలివేట్ చేసారు. పవన్ పాత్రలో స్టైలిష్ యాక్షన్ హైలైట్ అవ్వడమే కాకుండా, పవన్ గెడ్డం లుక్ కూడా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ని అందించింది. బాలు ఫెయిలైన నేపథ్యంలో పంజా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ సినిమా కూడా అంచనాలు అందుకోవడంలో విఫమైంది.
పంజా ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ గ్యాంగ్ స్టర్ కథల్ని సుమారు 15 ఏళ్ల పాటు టచ్ చేయలేదు. ఇప్పుడు ఓజీతో మళ్లీ అదే జోనర్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో OG పాత సెంటిమెంట్ ను తిరగ రాస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరేమవుతుందనే తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 25 వరకు ఆగాల్సిందే.


