Pawan Kalyan: ప్రస్తుతం ఓజీతోపాటు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ దశలో ఉంది. ఓ వైపు ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌లో పాల్గొంటూనే ఓజీ డబ్బింగ్‌ను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్.
ఉస్తాద్ భగత్‌సింగ్….
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్ జెట్ స్పీడులో సాగుతోంది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీఖన్నాలపై ఓ సాంగ్‌ను షూట్ చేశారు. దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లపై భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్‌లో ఈ పాటతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఈ షెడ్యూల్‌తో సినిమాలో పవన్ కళ్యాణ్ పార్ట్ మొత్తం పూర్తయింది.
డిసెంబర్‌లో రిలీజ్…
ఓ వైపు పాలిటిక్స్‌తో బిజీగా ఉండి కూడా ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌ను కంప్లీట్ చేసి సినిమాల పట్ల తనకున్న అంకితభావాన్ని, నిబద్ధతను పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పాడని మేకర్స్ పేర్కొన్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నెలాఖరుకల్లా షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం ఫినిష్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఓజీ డబ్బింగ్…
ఓజీ సినిమా డబ్బింగ్‌ను ఆదివారం పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ లాంఛ్‌కు అటెండ్ కానున్నట్లు చెబుతున్నారు.
Also Read- Elon Musk: లండన్‌లో భారీ హింస.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. ‘పోరాడండి లేదా చావండి’ అంటూ..
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా…
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఓజీ తెరకెక్కుతోంది. ఇందులో ఓజస్ గంభీర అనే క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఓవర్‌సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో టాలీవుడ్ గత సినిమాల రికార్డులను ఓజీ తిరగరాయడం ఖాయమని చెబుతున్నారు. ఓజీ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను నిర్మిస్తున్నాడు.


