Saturday, May 24, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. 'OG' రిలీజ్ డేట్ లాక్..!

Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. ‘OG’ రిలీజ్ డేట్ లాక్..!

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల బిజీ షెడ్యూల్‌తో దూసుకెళ్తూనే, మరోవైపు సినిమాలకు కూడా తనదైన ప్రాధాన్యత ఇస్తూ తన లైనప్‌ను సజావుగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ తుది దశకు చేరుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో, ‘ఓజీ’ రిలీజ్ డేట్ కూడా లాక్ అయినట్లు ఫిలిమ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

‘ఓజీ’ మూవీ తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్‌కి ఇది పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఎటు చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఒక్క గ్లింప్స్ వీడియోతోనే ప్రేక్షకుల్లో ఊపు తెప్పించాడు డైరెక్టర్ సుజీత్. గతంలో రీమేక్ సినిమాలతో పవన్ అభిమానులు కొంత నిరుత్సాహానికి లోనవ్వగా, ఇప్పుడు మాత్రం ఓరిజినల్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమా కొత్త ఊపునిస్తోంది.

మొదటగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్‌కు అంతరాయమయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మళ్లీ సెట్స్ పైకి వచ్చిన పవన్ ఈ నెల 26వ తేదీ నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్‌గా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇది అధికారికంగా ప్రకటన వెలువడితేనే స్పష్టత వస్తుంది కానీ, అప్పుడే ప్రేక్షకుల్లో ఓ వేడి పుట్టించిందనడంలో సందేహమే లేదు.

‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడన్నది తెలిసిందే. కానీ ఒక్క గ్యాంగ్‌స్టర్‌ పాత్ర కాదు, మరో రెండు విభిన్న కోణాలను ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. ఒకవైపు బ్రూటల్ గ్యాంగ్‌స్టర్‌, మరోవైపు ప్రేరణ కలిగించే లీడర్, ఇంకొకవైపు శిక్షణ ఇస్తున్న మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌గా పవన్ మూడు వేర్వేరు ఫేస్‌లతో కనిపించనున్నాడట. ఇది విని అభిమానులు ఊహించని రేంజ్‌లో సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు.

‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ మాస్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నాడు. పైగా పూర్తి స్థాయిలో ఒరిజినల్ కథతో వస్తున్న ‘ఓజీ’ సినిమాను పవన్ కెరీర్‌లో మరో కీలక మలుపుగా భావిస్తున్నారు సినీ వర్గాలు. రాజకీయం, సినిమా మధ్య సమతౌల్యం పాటిస్తూ తన అభిమానుల కోసం మరో బ్లాక్‌బస్టర్‌ను సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్… ఈసారి ఖచ్చితంగా గోల్డెన్ హిట్‌ను గెలుచుకుంటాడన్న నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News