Pawan Kalyan OG Fire Storm Song Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో ఫ్యాన్స్ ను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో చిత్రం ‘ఓజీ’ (OG). భారీ అంచనాలతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వారిలో జోష్ నింపేందుకు ఓ పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఓజీ ఫైర్ స్ట్రోమ్ సాంగ్ (OG Fire Storm Song) పేరుతో లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఫీల్ ది ఫైర్, పగ రగిలిన ఫైరూ… అంటూ సాగుతున్న ఈ పాట పవర్ఫుల్ గా ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లో ఈ లిరిక్స్‌కు తమన్ అందింంచిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలై కాసేపే అయినా.. వ్యూస్, లైక్స్ విషయంలో దూసుకుపోతూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక ఈ పాటను నజీరుద్దీన్, భరతరాజ్, శింబు, దీపక్ బ్లూ ఆలపించారు. లిరిసిస్ట్లు విశ్వ, శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించగా, రాజా కుమారి ఇంగ్లీష్ లిరిక్స్ ఇచ్చారు.
తమన్ కు బిర్యానీ పక్కా..
గతంలో పాటల మ్యూజిక్ విషయంలో తమన్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ కాపీ సాంగ్ కొడితే.. మా అమ్మ అన్నం పెడుతుందా అంటూ తమన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఓజీ ఫైర్ సాంగ్ అద్భుతంగా ఉండడంతో మెగా ఫ్యాన్స్ అంతా తమన్ కు ఈరోజు బిర్యానీ పక్కా అంటూ సరదా పోస్టులు పెడుతున్నారు.
కాగా, ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘ఓజాస్ గంభీర’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఇమ్రాన్ కనిపిస్తారు. సినిమా కథ ముంబయి బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. యంగ్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా, సీనియర్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


