హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ‘ఆర్‌ఎక్స్-100’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తన బోల్డ్ నటనతో యూత్‌ను ఫిదా చేసింది. ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’, ‘జిన్నా’, ‘రక్షణ’ వంటి పలు సినిమాలు చేసిన ఆశించినతం స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’(Mangalavaram) మూవీ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’ అనే సినిమాలో నటిస్తోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా తన హాట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
అయితే తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు భావోద్వేగానికి గురైంది. “మా నాన్నకు ఇటీవల క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. కిమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించాలని డిసైడ్ అయ్యాం. ఇవాళ ఆయనకు ఫస్ట్ కీమో థెరపీ సెషన్. నాకు కొంచెం భయంగా ఉంది. కానీ తప్పదు. మా నాన్న చాలా ధైర్యంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా మా నాన్న నన్ను పని చేసుకో, షూటింగ్స్, ఈవెంట్స్ కి వెళ్ళు అని చెప్పారు. మీతో ఈ విషయం చెప్పాలనిపించింది. ఇలాంటి సమయంలో మీ ప్రేమానురాగాలు మాకు సపోర్ట్ ఇస్తాయి. ఆయన త్వరగా కోలుకుంటాడని కోరుకుంటున్నాము” అంటూ తెలిపింది.