Buchi Babu Sana: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా కొత్తింట్లోకి అడుగుపెట్టారు. అయితే హైదరాబాద్‌లో కాదు. సొంత ఊరు పిఠాపురంలో ఇంటిని కట్టుకున్నారు. నూతన గృహ ప్రవేశ వేడుకలు శుక్రవారం జరిగాయి. భార్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు బుచ్చిబాబు. సింపుల్‌గా ఈ వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గృహ ప్రవేశ వేడుకలను పూర్తిచేసుకొని శనివారం జరిగిన ఏఆర్ రహమాన్ లైవ్ కాన్సెర్ట్‌కు బుచ్చిబాబు సానా హాజరయ్యారు. ఈ కాన్సెర్ట్‌లో చికిరి చికిరి సాంగ్‌కు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు రహమాన్. ఈ పర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంది.
కాగా చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతోంది. రిలీజైన ఇరవై నాలుగు గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నది. తెలుగులో అతి తక్కువ టైమ్‌లో హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న లిరికల్ వీడియోగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాటలో రామ్‌చరణ్ హుక్ స్టెప్పులు, ఫోక్ స్టైల్‌లో సాగిన లిరిక్స్‌తో పాటు రహమాన్ ట్యూన్స్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తోన్నాయి.
Also Read- Aditi Rao Hydari: మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తున్న అదితి
స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా బుచ్చిబాబు సానా పెద్ది మూవీని తెరకెక్కిస్తోన్నారు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల మేకర్స్ జాన్వీకపూర్ లుక్‌ను రిలీజ్ చేశారు. అచ్చియమ్మగా డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ దేవర తర్వాత జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సెకండ్ తెలుగు మూవీ ఇది. పెద్ది మూవీలో కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌తో పాటు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పిఠాపురం లో కొత్త ఇల్లు కట్టుకున్న పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా. శనివారం గృహ ప్రవేశ వేడుక జరిగింది.#Peddi #BuchiBabuSana #RamCharan pic.twitter.com/cOSJ3aIZLq
— Tollywoodtopics (@filmytopics) November 9, 2025
కాగా బుచ్చిబాబు సానాకు దర్శకుడిగా ఇది సెకండ్ మూవీ. సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మూవీతోనే పెద్ద విజయాన్ని అందుకున్నాడు. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.


