గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది'(Peddi) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేసిన మూవీ గ్లింప్స్(eddi Glimpse)యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఇందులో చరణ్ లుక్స్, క్రికెట్ షాట్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేశాయి.
ఈ నేపథ్యంలో గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 35 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబట్టింది. ఒక్క తెలుగులోనే 30 మిలియన్స్ వ్యూస్ దాటాయి. దీంతో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ‘పుష్ప 2’ తెలుగు గ్లింప్స్ 24 గంటల్లో 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించింది. ఈ మూవీ గ్లింప్స్ రికార్డులు బ్రేక్ చేయడంపై చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా వైడ్ చూస్తే మాత్రం యష్ ‘టాక్సిక్’ గ్లింప్స్ 36 మిలియన్స్ వ్యూస్‌తో ఫస్ట్ ప్లస్‌లో ఉండగా.. ‘పెద్ది’రెండో స్థానంలో నిలిచింది.