టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళికాని ప్రసాద్'(Pelli Kani Prasad). అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకశర్మ కథానాయికగా నటిస్తోంది. కె.వై.బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మీద ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని మార్చి 21న విడుదల చేస్తున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మూవీ యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. భారీ కట్నం ఇస్తేనే పెళ్లి అంటూ తండ్రి కండిషన్‌ను కాదనలేక.. ఏజ్ మీద పడుతున్నా పెళ్ళికాని ప్రసాద్ పాత్రలో సప్తగిరి నవ్వులు పూయించాడు. మొత్తంగా ట్రైలర్ పొట్ట చెక్కలు అయ్యేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి నవ్వేయండి.