8 Vasantalu Ott Release: తెలుగు మూవీ ‘8 వసంతాలు’ థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్‌గా నటించింది. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రలు పోషించారు. ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించాడు.
మైత్రీ మూవీ మేకర్స్….
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ 8 వసంతాలు మూవీని ప్రొడ్యూస్ చేయడంతో రిలీజ్‌కు ముందు ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఓ ప్రేమ జంట జర్నీని పొయేటిక్‌గా చూపిస్తూ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నా స్లోగా మూవీ సాగడం, ఓవర్ మెలోడ్రామా, ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో 8 వసంతాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
Also Read – Vaishnav Tej: సైలెంట్ అయిన మెగా హీరో – వైష్ణవ్‌తేజ్ కమ్ బ్యాక్ ఎప్పుడు?
సూర్య, దీపికా పదుకోనె….
8 వసంతాలు మూవీని సూర్య, దీపికా పదుకోనెలతో పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కించాలని అనుకున్నట్లు ప్రమోషన్స్‌లో డైరెక్టర్ ఫణీంద్ర నరిశెట్టి చెప్పాడు. బడ్జెట్ పరమైన సమస్యల వల్ల కాంప్రమైజ్ అయిపోయి కొత్త హీరోహీరోయిన్లతో రూపొందించానని చెప్పాడు. 8 వసంతాలు మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు.
10 కోట్ల బడ్జెట్…
చిన్న సినిమా అనే ఫీల్ ఆడియెన్స్‌లో కలగకుండా 8 వసంతాలు కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే ఖర్చు పెట్టింది. సినిమా బడ్జెట్ 10 కోట్లు దాటినట్లు సమాచారం. ఫుల్ థియేట్రికల్ రన్‌లో కోటి లోపు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
8 వసంతాలు కథ ఏంటంటే?
శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) రైటర్ కమ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. ఆమె జీవితంలోకి అనుకోకుండా వరుణ్ వస్తాడు. శుద్ధి అయోధ్యను ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తం చేస్తాడు. వరుణ్ ప్రేమను ఒప్పుకోవడానికి కొంత టైమ్ కావాలని కండీషన్ పెడుతుంది శుద్ధి అయోధ్య. ఆ తర్వాత ఏమైంది? వరుణ్ ప్రేమను శుద్ధి అయోధ్య ఒప్పుకుందా? వారి ప్రేమ కథలోకి సంజయ్ ఎలా వచ్చాడు అన్నదే ఈ మూవీ కథ.
Also Read – Tesla India Showroom: 15న ముంబైలో టెస్లా తొలి షోరూమ్ లాంచ్
ఎన్టీఆర్ బావమరిదికి జోడీగా…
8 వసంతాలు కంటే ముందు తెలుగులో మ్యాడ్ సినిమా చేసింది అనంతిక సనీల్ కుమార్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌కు జోడీగా మ్యాడ్ మూవీలో కనిపించింది అనంతిక.


