Thursday, June 12, 2025
Homeచిత్ర ప్రభKubera: కుబేర నుంచి ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ సాంగ్ వ‌చ్చేసింది

Kubera: కుబేర నుంచి ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ సాంగ్ వ‌చ్చేసింది

సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna), తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’ (Kubera). పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మూవీలో ధనుష్ తన కెరీర్‌లోనే తొలిసారి బిచ్చగాడిగా, నాగార్జున ధనవంతుడిగా నటిస్తున్నారు. ఇక రష్మిక మధ్య తరగతి అమ్మాయి పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల మూవీ నుంచి విడుదల చేసిన రెండు పాట‌లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘పీ పీ డుమ్‌ డుమ్‌..’ అంటూ సాగే ఈ పాటను చైతన్య రాయగా ఇంద్రావతి చౌహన్ పాడారు. పాట మొత్తం ఇంగ్లిష్‌ పదాలతోనే ఉండడం విశేషం. ఇంగ్లీష్‌ లిరిక్స్‌ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్‌ ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు.

ఈ మూవీని రూ.120 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తోంది. నాగ్, ధనుష్ స్టార్ డమ్ బట్టి మూవీకి ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా అన్ని భాషలకు కలిపి రూ. 47 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. మరోవైపు శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు రూ. 20 కోట్లు రివకరీ చేసిందట. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు, తమిళంలో కలిపి రూ. 60 కోట్ల బిజినెస్ చేసిందని.. ముఖ్యంగా తమిళంలో రూ. 20 కోట్లు, తెలుగులో రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాక్.

ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే చెన్నై, ముంబైలో ప్రెస్ మీట్లు నిర్వహించింది. ఈ ప్రమోషన్స్ కు ధనుష్, నాగార్జున, రష్మిక స్వయంగా పాల్గొనడం విశేషం. తన కెరీరలో కుబేర చిత్రం మైలురాలుగా నిలిచిపోతుందని ధనుష్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News