Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభCondolence To Kaikala : నటుడు కైకాల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Condolence To Kaikala : నటుడు కైకాల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించి తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ.. కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కైకాల కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

- Advertisement -

“గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
https://twitter.com/ysjagan/status/1606159075045408768?s=20&t=mRvc1KvBSXVLPJnW_qPQhA

“విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనాసార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ.” అని పేర్కొంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
https://twitter.com/ncbn/status/1606126591800590339?s=20&t=a9F_sjBHbIGueTV9mRJCoQ

“సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” నారా లోకేష్ పేర్కొన్నారు.
https://twitter.com/ncbn/status/1606126591800590339?s=20&t=H-GQ9CBE4uonP-MTBAZ41A

కైకాల సత్యనారాయణగారి మరణం తనను తీవ్రంగా కలచివేస్తోందని మహేశ్ అన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. సత్యనారాయణగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
https://twitter.com/urstrulyMahesh/status/1606143169866993687?s=20&t=mRvc1KvBSXVLPJnW_qPQhA

నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు అని అన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధృవతారను కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. సత్యనారాయణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News