Pooja Hegde: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు లక్ కూడా కలిసిరావాలి. గ్లామర్ విషయంలో పూజా హెగ్డేని వంక పెట్టడానికి చిన్న మైనస్ కూడా లేదు. ఇక నటన పరంగా తనెంత మంచి పర్ఫార్మరో గత సినిమాలతో నిరూపించింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్‌తో అదరగొట్టింది. ఎటొచ్చి లక్ మాత్రం కలసిరావడం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది.
ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర…
ఈ ఏడాది సూర్య రెట్రోతో పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ కూలీపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర నుంచి బయటపడాలని కలలు కన్నది. కానీ పూజా హెగ్డే కోరిక మాత్రం తీరలేదు.
Also Read- Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్‌డే ట్రీట్ – ఈ సారి మెగాస్టార్ ట్రిపుల్ బొనాంజా
మోనిక సాంగ్…
కూలీ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. మోనిక అనే పాటలో కనిపించింది. రిలీజ్‌కు ముందు ఈ పాట పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ పాటకు పూజా హెగ్డే గ్లామర్, స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. కూలీ మూవీ పట్ల ఫ్యాన్స్‌లో క్రేజ్ పెరగడానికి మోనిక సాంగ్ కూడా ఓ కారణంగా నిలిచింది.
కానీ సినిమా రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. థియేటర్లలో ఈ పాటను చూసిన ఫ్యాన్స్ దారుణంగా డిజపాయింట్ అయ్యారు. మోనిక సాంగ్ ప్లేస్‌మెంట్ సరిగ్గా కుదరలేదని విమర్శిస్తున్నారు. రిలీజ్‌కు ముందు ఉన్న వైబ్ థియేటర్లలో కనిపించలేదని అంటున్నారు. స్టోరీ ఫ్లోను మోనిక సాంగ్ దెబ్బతీసేలా ఉందని అంటున్నారు.
నెగెటివ్ టాక్…
దానికి తోడు కూలీ సినిమాకు దారుణంగా నెగిటివ్ టాక్ వచ్చింది. కథ లేకుండా కేవలం రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోకు ఉన్న క్రేజ్‌తో ఓపెనింగ్స్ బాగున్నా లాంగ్ రన్‌లో కూలీ మూవీ థియేటర్లలో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ సక్సెస్‌లకు కూలీతో బ్రేకులు పడ్డాయని అంటున్నారు.
జననాయగన్ పైనే…
కూలీ మూవీతో ఈ ఏడాది పూజా హెగ్డే ఖాతాలో రెండో ఫ్లాప్ చేరడం ఖాయమైంది. దళపతి జననాయగన్ మూవీ పూజా హెగ్డే కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమా రిజల్ట్ పూజా హెగ్డే సౌత్ కెరీర్‌ను డిసైడ్ చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. జననాయగన్ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జననాయగన్‌తో పాటు లారెన్స్ రాఘవ కాంచన 4లో హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే.
Also Read- Today gold Rates: మళ్ళీ స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేడు తులం ఎంతంటే..!


