Pooja Hegde Item Song: హీరోయిన్ పూజా హెగ్డే ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అందుకు కారణం ఆమె చేసిన ఐటెమ్ సాంగే. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. దీంతో హీరోయిన్ స్టెప్పులపై వైరల్ అయ్యాయి. టాలీవుడ్ ప్రేక్షకులు ముద్దుగా ఆమెను “బుట్టబొమ్మ”గా పిలుచుకుంటారు.
అయితే ఈ పాట లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ చిత్రంలోనిది. ఈ స్పెషల్ సాంగ్ శనివారం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రధానపాత్ర పోషిస్తుండగా.. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతీహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘కూలీ’ సినిమా వచ్చే నెల ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఇప్పటికే వరుసగా నటీనటుల ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ క్రమంలో సినిమాలోని స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు.
పోర్ట్ ఏరియాలో సాగే ఈ పాట గ్రూప్ డ్యాన్స్.. పూజా హెగ్డే ఆద్యంతం కట్టిపడేస్తుంది. మాస్ ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. అయితే ఈ సాంగ్‌లో హీరోలు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ సాంగ్‌లో రజనీకాంత్, నాగార్జున స్టెప్పులేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్ ని కేవలం కమర్షియల్ ఎలిమెంట్ కోసమే సినిమాలో యాడ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే పూజా హెగ్డే సినిమాలు లేకపోవడం.. అందులోనూ ఆమె ఐటెమ్ సాంగ్‌లో నటించడంతో ఆమె ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఆమె తాజాగా సూర్య సరసన నటించిన ‘రెట్రో’ మూవీ ఆశినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉండగా.. ‘మోనికా’ సాంగ్ కు హీరోయిన్ పూజా హెగ్డే తీసుకున్న పారితోషకంపై ఇప్పుడు అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక్కపాటకే సుమారు రూ.3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నంబర్ చూస్తే నిర్మాతలకు దిమ్మతిరిగి పోవాల్సిందే. అయితే ఈమె ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.


