Pooja Hegde: లక్కంటే పూజా హెగ్డేదేనని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ హిట్టు అందుకొని నాలుగేళ్లు దాటిపోయింది. అల వైకుంఠపురములో తర్వాత పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల్లో పరాజయాలు వెంటాడుతున్నాయి. అయినా పూజా హెగ్డేకు అవకాశాలకు కొదవలేదు. ప్రస్తుతం దళపతి విజయ్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది.
అమరన్ డైరెక్టర్‌తో…
కోలీవుడ్‌లో పూజా హెగ్డే మరో బంపరాఫర్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో ఓ తమిళ మూవీ తెరకెక్కుతోంది. డీ55 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలుత ధనుష్‌కు జోడీగా మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. కానీ అనివార్య కారణాల వల్ల మీనాక్షిని తప్పించిన దర్శకనిర్మాతలు పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read- Ari Movie: అక్టోబర్ 10న అనసూయ ‘అరి’ వచ్చేస్తోంది.. దర్శకుడు జయశంకర్ ఏడేళ్ల కష్టం
వాస్తవ ఘటనలతో…
వాస్తవ ఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డీ55 మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. రాజ్‌కుమార్ పెరియసామి గత సినిమాల తరహాలోనే కథలో హీరోయిన్ రోల్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. పూజా హెగ్డే కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందని పేర్కొంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో ధనుష్, రాజ్‌కుమార్ పెరియాసామి సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ నుంచి షూటింగ్ మొదలైంది. డిసెంబర్ నుంచి ధనుష్ మూవీ షూటింగ్‌లో పూజా హెగ్డే పాల్గొనబోతున్నట్లు సమాచారం.
దుల్కర్ సల్మాన్ మూవీతో…
ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్‌తో జననాయగన్ సినిమా చేస్తోంది పూజా హెగ్డే. హెచ్ వినోథ్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. లారెన్స్ కాంచన 4లో అవకాశాన్ని దక్కించుకున్నది. మరోవైపు దుల్కర్ సల్మాన్ సినిమా ద్వారా లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది పూజా హెగ్డే. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీకి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా 2022లో వచ్చిన ఆచార్య సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో టాలీవుడ్‌కు దూరమైంది.
Also Read- Nag Ashwin: రూట్ మారుస్తోన్న నాగ్ అశ్విన్.. ఆలియా స్థానంలో సాయి పల్లవి


