Billa Ranga Basha Movie: పూజాహెగ్డే తెలుగు, తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అదేకాక బాలీవుడ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ అక్కడి ప్రేక్షకులను తన అందాలతో మెప్పిస్తోంది. కన్నడ ఫ్యామిలీలో పుట్టిన పూజాహెగ్డే ఇతర భాషల్లోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే ఓ శాండల్‌వుడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
బిల్లా రంగా బాషా…
విక్రాంత్ రోణ తర్వాత హీరో కిచ్చా సుదీప్, డైరెక్టర్ అనూప్ భండారీ కాంబినేషన్‌లో కన్నడంలో బిల్లా రంగా బాషా పేరుతో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 2209 టైమ్ పీరియడ్‌లో జరిగే కథ ఇదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో అనూప్ భండారీ బిల్లా రంగా బాషాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
Also Read – Narendra Modi: విదేశీ పర్యటనలో మోదీ.. నాలుగు రోజులు అక్కడే..!
ఇద్దరు హీరోయిన్లు…
కాగా బిల్లా రంగా బాషాలో కిచ్చా సుదీప్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసింది. ఈ పాత్రల కోసం పూజాహెగ్డేతో పాటు రుక్మిణి వసంత్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో పూజాహెగ్డే రోల్ రెగ్యులర్ గ్లామర్ పాత్రలా కాకుండా యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుందని అంటున్నారు. త్వరలోనే బిల్లా రంగా బాషా సెట్స్‌లో పూజాహెగ్డే అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.
రెండు డిజాస్టర్లే…
ఈ ఏడాది పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ దేవాతో పాటు తమిళ సినిమా రెట్రో డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం తమిళంలో మూడు, హిందీలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది పూజాహెగ్డే.
కూలీలో స్పెషల్ సాంగ్…
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతోన్న కూలీ మూవీలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఇటీవలే ఈ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కేవలం మూడున్నర నిమిషాల నిడివితో సాగే ఈ క్యారెక్టర్ కోసం పూజాహెగ్డే మూడు కోట్లకుపైనే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. దళపతి విజయ్ చివరి మూవీ జననాయగన్‌లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కాంచన 4కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఓ హిందీ మూవీ కోసం వరుణ్ ధావన్‌తో జోడీ కట్టింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ మూవీతో తెలుగులో పెద్ద హిట్ అందుకున్నాడు కిచ్చా సుదీప్. ఈ మూవీలో విలన్‌గా నటించాడు. ఈగతో వచ్చిన ఫేమ్ కారణంగా కిచ్చా సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. బిల్లా రంగా బాష కూడా తెలుగులో రిలీజ్ కాబోతుంది.


