Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPooja Hegde: దుల్కర్ ప్రేమలో బుట్టబొమ్మ

Pooja Hegde: దుల్కర్ ప్రేమలో బుట్టబొమ్మ

Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పూజా హెగ్డేకి ఎంతటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాతో బుట్టబొమ్మగానూ అభిమానుల మనసు దోచుకుంది. పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎంట్రీ చిత్రాలుగా నటించిన ముకుంద, ఒక లైలా కోసం లాంటి సినిమాలు పూజాకి కలిసి రాలేదు. ఈ సినిమాలు రెండు హిట్ అయితే బాలీవుడ్ కి వెళ్ళేది కాదు. కానీ, అక్కడ కూడా పూజాకి షాకే తగిలింది.

- Advertisement -

హిందీలో ఎంట్రీ ఇస్తూ చేసిన మోహంజాదారో భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా నిర్మాతకి తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత తెలుగులో మళ్ళీ ఛాన్స్ అందుకొని దువ్వాడ జగన్నాధంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ హిట్ అయినప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంది. గద్దలకొండ గణేశ్, మహర్షి లాంటి సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూజా ఆ తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమా స్టార్ హీరోయిన్‌గా మారింది.

Also Read – Potato: బంగాళాదుంపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..?

అయితే, పూజాకి ఈ స్టార్ స్టేటస్ ఎంతకాలమో నిలబడలేదు. ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, విజయ్ తో చేసిన బీస్ట్ సినిమాలు తన కెరీర్ ని తలకిందులు చేశాయి. ఈ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసి కూడా బాగానే వెనకేసుకుంది. కానీ, పూజా లాంటి గ్లామర్ బ్యూటీకి కావాల్సింది పాన్ ఇండియా సక్సెస్. ఆ ఆశతోనే సూర్య నటించిన రెట్రో సినిమా చేస్తే అది ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీలో మోనికా అంటూ ఊపేసినప్పటికీ ఆ పాటలో కనిపించిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కి క్రేజ్ వచ్చింది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ సరసన జన నాయగన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాకుండా తాజాగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ షూటింగ్ తో పాటు హీరోయిన్ గా ఎంపికైన పూజా గురించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. అంతేకాదు, ఆన్ సెట్స్ లో దుల్కర్-పూజా హెగ్డే బైక్ పై వెళుతున్న పిక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా ప్రేమ కథతో తెరకెక్కుతున్న సినిమా అని కూడా చిత్రబృందం తెలిపింది. దుల్కర్ కి మన తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Also Read – Telangana Congress Akarsh 2.0 : హస్తం ఆకర్ష్ 2.0

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad