Nithiin Next Movie: పూజాహెగ్డే (Pooja Hegde) తెలుగు సినిమాల్లో కనిపించి మూడేళ్లు దాటిపోయింది. చివరగా 2022లో వచ్చింది ఎఫ్3 మూవీలో స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఎఫ్ 3 కంటే ముందు పూజాహెగ్డే నటించిన ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ పరాజయాల ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌కు దూరమైంది పూజాహెగ్డే.
రీఎంట్రీ…
తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న పూజాహెగ్డే ఎట్టకేలకు ఓ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. నితిన్‌తో జోడీ కట్టబోతున్నట్లు తెలిసింది. ఇష్క్ తర్వాత నితిన్, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. హార్స్ రైడింగ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి స్వారీ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడర్‌గా ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు చెబుతోన్నారు. గతంలో తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ పాయింట్‌తో విక్రమ్ కే కుమార్ ఈ కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పర్ఫార్మెన్స్‌కు స్కోప్…
కాగా ఈ సినిమాలో నితిన్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ కే కుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అతడి గత సినిమాల మాదిరిగానే ఇందులో కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో పూజాహెగ్డే కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. విక్రమ్ కే కుమార్ చెప్పిన కథ విని పూజా హెగ్డే చాలా ఇంప్రెస్ అయ్యిందని అంటున్నారు.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్…
త్వరలోనే నితిన్, విక్రమ్ కే కుమార్ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలిసింది. గత కొన్నాళ్లుగా నితిన్‌తో పాటు పూజాహెగ్డే బ్యాడ్‌టైమ్ నడుస్తోంది.
రాబిన్‌హుడ్ నిరాశ…
భీష్మ తర్వాత నితిన్ చేసిన సినిమాలన్నీ ఫెయిల్యూర్స్ అయ్యాయి. భారీగా ఆశలు పెట్టుకున్న రాబిన్‌హుడ్ సైతం అతడిని ముంచేసింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యాభై శాతం కూడా రికవరీ సాధించలేకపోయింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మరోవైపు టాలీవుడ్‌కు దూరమైనా…కోలీవుడ్‌లో మాత్రం పూజాహెగ్డే మంచి ఆఫర్లనే అందుకుంటోంది. ఇటీవలే సూర్యతో రెట్రో మూవీ చేసింది. ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్ జననాయగన్‌తో పాటు లారెన్స్ రాఘవ కాంచన 4లో హీరోయిన్‌గా నటిస్తుంది పూజాహెగ్డే. రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆగస్ట్ 14న తెలుగు, తమిళ భాషల్లో కూలీ రిలీజ్ కాబోతుంది. హిందీలో వరుణ్ ధావన్ తో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nagarjuna-remuneration-as-host-for-bigg-boss-telugu-season-9/


