Pooja Hegde: పూజా హెగ్డే హిట్టు అందుకొని మూడేళ్లు దాటిపోయింది. డిజాస్టర్స్ కారణంగా టాలీవుడ్‌కు దూరమైన ఈ బుట్టబొమ్మ తమిళంలో మాత్రం ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బిజీగా ఉంది. రజనీకాంత్, దళపతి విజయ్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఓ బ్లాక్‌బస్టర్‌తో పూర్వ వైభవం దక్కించుకోవాలని ఆరాటపడుతోంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇప్పుడు రీఎంట్రీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
బాహుబలి 3…
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది పూజా హెగ్డే. మోనికా అంటూ సాగిన ఈ పాట పెద్ద హిట్టయ్యింది. ఈ పాటలో పూజా హెగ్డే స్టెప్పులు, గ్లామర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కూలీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారని అడిగిన ప్రశ్నకు బాహుబలి 3 మూవీ అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది పూజా హెగ్డే. బాహుబలి 3 గనక తీస్తే ఆ సినిమాలో హీరోయిన్‌గా తనకు అవకాశం ఇవ్వమని ప్రభాస్‌ను రిక్వెస్త్ చేస్తానని పూజా హెగ్డే చెప్పింది.
గ్లామర్ డాల్…
బాలీవుడ్‌లో గ్లామర్ డాల్‌గా ముద్రపడటంపై కూడా పూజా హెగ్డే రియాక్ట్ అయ్యింది. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలోనే పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానని అన్నది. రాధేశ్యామ్ చూసే రెట్రో మూవీలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు నాకు ఛాన్స్ ఇచ్చారు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా నాలోని యాక్టింగ్ టాలెంట్‌ను చాటిచెప్పడానికి ఈ సినిమాలు ఉపయోగపడ్డాయి. బాలీవుడ్ దర్శకులు మాత్రం ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నేను చేసిన సౌత్ సినిమాలు చూడకపోవడం వల్లే కేవలం గ్లామర్ రోల్స్‌కు మాత్రమే నేను సరిపోతానని బాలీవుడ్ దర్శకులు అపోహపడుతున్నారని అనుకుంటున్నా. బాలీవుడ్‌లో నా పట్ల ఉన్న అపోహలు తొలగిపోయే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది.
బీస్ట్ తర్వాత…
ప్రస్తుతం తమిళ మూవీ జననాయగన్‌లో దళపతి విజయ్‌కి జోడీగా నటిస్తోంది పూజా హెగ్డే. బీస్ట్ తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లారెన్స్ చేస్తున్న కాంచన 4 మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది.


