Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPoonam Kaur: ‘బాలయ్య’పై పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌.. మండిపడుతున్న ‘మెగా’ ఫ్యాన్స్‌

Poonam Kaur: ‘బాలయ్య’పై పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌.. మండిపడుతున్న ‘మెగా’ ఫ్యాన్స్‌

Poonam Kaur Tweet about Balayya: సినిమాల్లో కనిపించింది తక్కువే అయినా ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్‌ చేసే పూనమ్‌ కౌర్‌.. తాజాగా మరో వివాదాస్పద ట్వీట్‌తో హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని రోజులుగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ మధ్య వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు. చిరుకు మద్దతుగా పలువురు ప్రముఖులు నిలిచారు. అయితే ఇప్పుడు బాలయ్యను సపోర్ట్ చేస్తూ పూనమ్‌ కౌర్‌ ఓ ట్వీట్‌ చేయడంతో అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/keerthy-suresh-lip-lock-with-vijay-devarakonda/

ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజీ’ సినిమాను ప్రశంసించిన ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పూనమ్‌.. తాజాగా బాలకృష్ణపై ప్రశంసలు కురిపించింది. దీంతో మెగా vs నందమూరి అభిమానుల మధ్య నెట్టింట్లో వార్‌ మొదలైంది. పూనమ్ కౌర్ 2024, సెప్టెంబర్ 1న చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ ‘బాలయ్య ఎప్పుడూ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది సమయానుసారం బయటపడుతుంది’ అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌ బాలయ్య అభిమానులను సంతోషపరిచినా.. మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి మాత్రం గురైంది. మహిళలపై బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు మరిచిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఏడాది క్రితం చేసిన పూనమ్‌ చేసిన ట్వీట్‌ ఏంటంటే.. 

ఓ ఈవెంట్‌లో బాలయ్య ‘సమర సింహారెడ్డి’ పాట‌కి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను పూనమ్‌ జత చేసింది. ఆ పర్ఫామెన్స్‌ను బాలయ్య ఉత్సాహంగా వీక్షించాడు. ఆ వీడియోకి ‘బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు. అది అన్ని సీజన్లలోనూ మనుషులకి, జంతువులకు నీడనిస్తుంటుంది. ‘ఆదిత్య 369’ నుంచి ‘భగవంత్ కేసరి’ వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఉత్సాహంగానే ఉన్నారు. అది ఆయనకు దేవుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం.’ అంటూ ఆ పోస్ట్‌లో పూనమ్‌ రాసుకొచ్చింది. ఇక ఆ ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ పూనమ్ తాజాగా మ‌రో ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad