Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభPoonam Pandey: కుంభ‌మేళాలో పవిత్ర స్నానం చేసిన హాట్ బ్యూటీ

Poonam Pandey: కుంభ‌మేళాలో పవిత్ర స్నానం చేసిన హాట్ బ్యూటీ

ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న‌ మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే(Poonam Pandey) పవిత్ర స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

“నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని చాలా ద‌గ్గ‌ర‌గా చూశా. ఇక్క‌డ 70ఏళ్ల వ్యక్తి చెప్పులు లేకుండా గంట‌ల త‌ర‌బ‌డి న‌డుస్తున్నాడు. కుంభ‌మేళాలో త‌మ ప్రాణాలు కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుంద‌ని ఆశిస్తున్నా” అని పేర్కొంది.

కాగా 45 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో ఇప్పటివరకు 27 కోట్ల మందికి పైగా భక్తులు ప‌విత్ర స్నానాలు ఆచ‌రించిన‌ట్లు ఉత్తరప్రదేశ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ నెల 13న ప్రారంభ‌మైన ఈ కుంభ‌మేళా ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad