Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభOG Records: OG మేనియా.. ఇదేం అభిమానం.. ఆ రికార్డ్‌పై క‌న్నేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌

OG Records: OG మేనియా.. ఇదేం అభిమానం.. ఆ రికార్డ్‌పై క‌న్నేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌

OG Movie Records: OG కోసం ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మూవీ సెప్టెంబ‌ర్ 25న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ రేంజ్‌లో విడుద‌ల కాబోతుంది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో డివివి దాన‌య్య సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మరో పదిహేను రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై రోజు రోజుకీ బ‌జ్ పెరుగుతోంది. నార్త్ అమెరికాలో అయితే సినిమా ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసుకుంది. వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్ మార్క్‌ కూడా క్రాస్ అయ్యింది. ఇప్పటికే ఉన్న హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ వస్తాయని బయ్యర్లు నమ్ముతున్నారు. ఇక ట్రైలర్ విడుదలయ్యాక హైప్‌ మరింత పెరుగుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో నెవర్ బిఫోర్ రేంజ్‌లో ఎప్ప‌టికీ గుర్తుండి పోయేలా అనే స్థాయిలో చిరకాలం గుర్తుండిపోయే వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రారంభం హైద‌రాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి విశ్వనాథ్ థియేటర్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ వేడుక‌ల్లో భాగంగా ఓ పని చేయ‌బోతున్నారు. అదేంటంటే.. ఇక్కడ ఏకంగా 33 పవన్ కళ్యాణ్ కటౌట్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా ఓ రికార్డే అంటున్నాయి సినీ స‌ర్కిల్స్‌. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి క‌టౌట్స్ విష‌యంలో క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పేరు మీద మాత్ర‌మే రికార్డ్ ఉంది. ఇప్పుడా రికార్డ్‌ను ప‌వ‌న్ దాటేయ‌బోతున్నారు.

Also Read – Reverse Walking: వెనకడుగుతో.. ఆరోగ్యానికి ముందడుగు! ‘రివర్స్ వాకింగ్’ అద్భుతాలు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ‘OG’ వరకు పవన్ కళ్యాణ్ పోషించిన ప్రతి సినిమాలోని పాత్రను నిలువెత్తు రూపంలో ప్రదర్శించనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కటౌట్‌లను పెట్టడం ఇదే మొదటిసారి అని ఫ్యాన్ అసోసియేషన్ చెబుతోంది. గతంలో బెంగళూరులో పునీత్ రాజ్‌కుమార్ కోసం ‘గంధదగుడి’ మూవీ రిలీజ్ టైమ్‌లో 30 కటౌట్‌లు పెట్టిన రికార్డును అధిగమించేందుకు ఈ 33 కటౌట్‌లను ఎంచుకున్నారు. ఈ కటౌట్‌ల ఆవిష్కరణకు సెలబ్రిటీలను ఆహ్వానించే ప్రణాళికలో ఉన్నారట పవన్ అభిమానులు.

OG టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త జోష్ ఇస్తుందని ఎగ్జిబిటర్లు ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని చిత్రాలు మినహా జనాన్ని హాళ్లకు రప్పించిన సినిమాలు పెద్దగా లేవు. ఓజికి సానుకూల టాక్ వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ మూడో వారంలో విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోనూ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రు కాబోతున్నార‌ని స‌మాచారం.

Also Read – Rains In Telangana: రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad