HBD Pawan Kalyan: టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” పై అభిమానుల్లో క్రేజ్ తారాస్థాయికి చేరింది. డీవీవీ దానయ్య సమర్పణలో, కళ్యాణ్ దాసరి నిర్మాణంలో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే టాలీవుడ్‌ను మించి పాన్ ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ స్టామినా, సుజీత్ స్టైలిష్ నేరేషన్‌తో కలిసిపోతే మాస్ హరికేన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్ పీఎస్‌పీకే ఫ్యాన్స్‌ను హై ఆన్ ఎనర్జీలోకి తీసుకెళ్లాయి.
తాజాగా పవన్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన క్రేజీ పోస్టర్ ఫ్యాన్స్‌కు పండుగే. బ్లాక్ డాడ్జ్ కారుపై కూల్‌గా కూర్చున్న పవన్.. రఫ్ బియర్డ్, డార్క్ టోన్ షర్ట్, ఆ మాస్ అటిట్యూడ్‌తో వన్ మ్యాన్ ఆర్మీలా కనిపించేశారు. బ్యాక్‌డ్రాప్‌లో ముంబై హైవె పరంగా లైటింగ్, బిల్డింగ్స్ మధ్య పవన్ ప్రెజెన్స్ అగ్రెషన్‌కు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. ఈ పోస్టర్‌కి హైలైట్ డైలాగ్ ‘వీధుల్లో రక్తం అగ్ని పండుగగా మారుతుంది’ పిక్చర్ మూడ్‌ని క్లియర్‌గా సెటప్ చేసింది. ఇది మామూలు సినిమా కాదని, ఫుల్ ఫైర్ ఉందని స్పష్టమవుతోంది. ఇక సాయంత్రం విడుదల కాబోతున్న టీజర్ ఎలా ఉండబోతుందనే అంచనాలను వేయలేని నెక్ట్స్ రేంజ్ లో ఉంది.
ఓజీ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటుల ప్రెజెన్స్ కూడా సినిమాకు మరో లెవెల్ డెప్త్ తీసుకొస్తోంది. ఎస్. థమన్ సంగీతం మరో మెయిన్ పాయింట్. ఇప్పటికే విడుదలైన “ఫైర్‌స్టార్మ్” సాంగ్ మాస్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తీసుకొచ్చింది. ఇక “సువ్వి సువ్వి” మెలోడీ ఎమోషనల్‌గా వర్కౌట్ అయింది. థమన్ BGMతో థియేటర్స్‌లో పూనకాలే ఉండబోతున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Every era gets a star.
But only once in history comes a phenomenon like Pawan Kalyan ❤️Wishing our #OG the happiest of birthdays 🙏🏻#HBDPawanKalyan #TheyCallHimOG pic.twitter.com/sJsFFpN3Mv
— DVV Entertainment (@DVVMovies) September 2, 2025
సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజుకి సిద్ధమవుతోన్న “ఓజీ”కి ప్రస్తుతం పెద్దగా పోటీ లేదు. ఓవర్సీస్‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఓపెనింగ్ డే నుంచే ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉన్నట్టు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఊపు చూస్తుంటే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపించటం ఖాయమని ట్రేడ్ వర్గాలంటున్నాయి.


