Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan Songs: పవన్ కళ్యాణ్ పాడిన చార్ట్ బస్టర్ సాంగ్స్..

Pawan Kalyan Songs: పవన్ కళ్యాణ్ పాడిన చార్ట్ బస్టర్ సాంగ్స్..

Pawan Kalyan Songs: తెలుగు సినీ రంగంలో పవన్ కళ్యాణ్ పేరు వినిపించగానే.. మాస్ ఎనర్జీ, స్టైల్, తనదైన యాటిట్యూడ్ వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే అతని ప్రతిభ కేవలం నటనకే పరిమితమైపోలేదు. గాయకుడిగా కూడా తన గాత్ర శక్తిని నిరూపించుకున్న పవన్, కొన్ని మ్యూజికల్ మ్యాజిక్ మూమెంట్స్‌ను అభిమానులకు, ప్రేక్షకులకు అందించారు. ఒకటి, రెండు పాటలు పాడి ఆగిపోలేదు పవన్. తన కెరీర్‌ మొత్తం మీదనూ అతని గొంతు ఏదో ఒక టైంలో మెరుపులా మెరిసింది. ప్రతి పాటనూ అభిమానులు గుండెల్లో పెట్టుకునేలా చేశారు. ఆ చార్ట్ బస్టర్ సాంగ్స్ వివరాలను ఓసారి చూద్దాం…

- Advertisement -

1. తమ్ముడు (1999) – తాటి చెట్టెక్కలేవు
పవన్ గాయకుడిగా తెరపై తన గొంతును పరిచయం చేసిన సినిమా తమ్ముడు. కిక్ బాక్సింగ్ మీద తెలుగులో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో పవన్ పాడిన ‘తాటి చెట్టెక్కలేవు…’ అనే పాట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. రియల్ మాస్ వేవ్‌తో థియేటర్లను ఊపేసిన పాట ఇది. ఈ పాటతోనే అభిమానులకు మరింత దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఈ పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. కాలేజ్ కుర్రాళ్లు ఈ సాంగ్‌ను తెగ ఎంజాయ్ చేశారు.

2. ఖుషి (2001) – బై బైయ్యే బంగారు రమణమ్మ
పవన్ క్రేజ్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లిన సినిమా ఖుషి. ఈ మూవీలో ‘బై బైయ్యే బంగారు రమణమ్మ’ సాంగ్ చిన్నదే అయినా.. ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చింది. ఈ పాటలో పవన్ పాడిన ఫన్ టోన్, అల్లరి ఎనర్జీ సినిమాకే ఒక హైలైట్ అయింది. అలీతో కలిసి చేసిన కామెడీ సీన్‌లో ఈ పాట అంతులేని ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చింది.

3. జానీ (2003) – నువ్వు సారా తాగుట మానురన్నో
హీరోగానే కాకుండా దర్శకుడిగానూ పవన్ చేసిన సినిమా జానీ. సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టకున్నా.. సాంగ్స్ మాత్రం చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇందులో ‘నువ్వు సారా తాగుట మానురన్నో..’ అనే పాటను పవన్ పాడారు. ఇది పవన్ గాత్రంలోని మాస్ ఎమోషన్‌కి ఒక శక్తివంతమైన ఉదాహరణ. తన డైరెక్షన్‌లో తీసిన సినిమాలోనే ఇలా గాయకుడిగా తళుక్కుమన్నాడు.

4. గుడుంబా శంకర్ (2004) – కిళ్లి కిళ్లీ
పవన్ గుడుంబా శంకర్ చిత్రంలో గొంతుని సవరించుకున్నారు. ఇందులో కిళ్లి కిళ్లీ .. అనే సాంగ్ కు పవన్ గొంతు సరికొత్త ఫీలింగ్ ఇచ్చింది. పక్కా మాస్ మరియు ఫన్ మిక్స్‌తో ఉన్న ఈ పాట, స్టేజ్ పర్ఫార్మెన్స్‌లలో ఇంకా వినిపిస్తూనే ఉంది.

5. పంజా (2011) – పాపారాయుడు
పవన్ కళ్యాణ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా పంజా. ఇందులో పవన్ స్వరం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ పాటకి ఓ ఫోక్ మాస్ టచ్ ఇచ్చింది. సినిమాకు పవన్ గాత్రం మూడ్‌ను ఎలివేట్ చేసింది.

6. అత్తారింటికి దారేది (2013) – కాటమరాయుడా
పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది మూవీలో పవన్ పాట పాడారు. ఒక సింపుల్ డైలాగ్‌లా మొదలైన ఈ పాట, పవన్ వాయిస్‌తో పవర్‌ఫుల్ ట్రాక్‌గా మారింది. తర్వాతి దశలో ‘కాటమరాయుడు’ అనే సినిమా టైటిల్‌కే ఇది ప్రేరణ అయింది.

7. అజ్ఞాతవాసి (2018) – కొడకా కోటేశ్వరరావు
పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఇందులోనూ పవన్ పాడిన పాట ప్రేక్షకులను మెప్పించింది. పవన్ గాత్రంలో వచ్చిన ఈ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్. సొంత మార్క్ కామెడీతో, మాస్ స్టైల్‌తో పాట యూత్‌ని ఊపేసింది.

8. హరి హర వీరమల్లు – మాట వినాలి
పవన్ కళ్యాణ్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ హరి హర వీరమల్లు. పాన్ ఇండియా మూవీలో పవన్ గాత్రం గంభీరతను అందించింది. పాటకు, సినిమాలోని యాక్షన్ ఫీల్‌కి సరిగ్గా తగిన ఎనర్జీ ఇవ్వగలిగారు పవన్.

పవన్ కల్యాణ్ కేవలం నటుడిగానే కాకుండా, తన గాత్రంతోనూ ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. ఆయన పాడిన ప్రతీ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి, ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad