Sandeep Reddy Vanga : తాజాగా యూత్‌ను టార్గెట్ చేస్తూ.. ‘ఈ నగరానికి ఏమైంది’ తరహా ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జిగ్రీస్’ చిత్రం. ‘మ్యాడ్’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్ తో పాటు కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడంతా చర్చ.
సందీప్ వంగా స్టైల్‌లో ప్రమోషన్ ట్రీట్
‘జిగ్రీస్’ సినిమాకు ఊహించని బూస్ట్ ఇచ్చింది మరెవరో కాదు.. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. నిర్మాత కృష్ణ వోడపల్లి చిన్ననాటి స్నేహితుడు కావడంతో, సందీప్ ఈ సినిమా ప్రమోషన్‌ను తన భుజాలపై వేసుకున్నారు. ఆయన రిలీజ్ చేసిన టీజర్‌కు యూత్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీమ్ ప్యాషన్‌తో పనిచేసిందని, ‘జిగ్రీస్’ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుందని సందీప్ రెడ్డి నమ్మకంగా చెబుతున్నారు.
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ముహూర్తం ఫిక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ‘జిగ్రీస్’ చిత్ర యూనిట్ ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ద్వారానే సినిమా విడుదలకు శుభముహూర్తం ఖరారు చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘జిగ్రీస్’ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇప్పటికే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేసిన పాట జనాల్లోకి వెళ్లిపోయింది. ఇక సందీప్ వంగా బ్రాండ్ ప్రమోషన్ తోడవ్వడంతో.. యూత్‌లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నవంబర్ 14న ఈ ‘జిగ్రీస్’ బ్యాచ్ థియేటర్లలో ఎంతమేర నవ్వులు పూయిస్తుందో చూడాలి.


