Prabhas: మన డార్లింగ్, ఈసారి ఏకంగా డబుల్ ధమాకాకు తెర లేపుతున్నాడు. కేవలం వారం రోజుల గ్యాప్‌లో రెండు సంచలనాలతో తన డామినేషన్‌ను చూపించబోతున్నాడు!
అక్టోబర్ 23 – ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్!
ప్రభాస్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు. ఈసారి ఉత్సాహం నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్ రాబోతుంది. ప్రస్తుతం ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా నుంచి, ప్రభాస్ బర్త్‌డే అయిన అక్టోబర్ 23వ తేదీన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ లేదా అధికారిక టైటిల్ రివీల్ కాబోతుంది. 1940ల బ్యాక్‌డ్రాప్‌లో, బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోయే లుక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ విడుదలయ్యే క్షణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు!
ALSO READ: https://teluguprabha.net/cinema-news/vetri-maran-simbu-samrajyam-vadachennai-universe/
అక్టోబర్ 31 – ‘బాహుబలి: ది ఎపిక్’ రీ-ఎంట్రీ!
ఒకవైపు కొత్త సినిమా అప్‌డేట్ ఉంటే, మరోవైపు బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన మన మహారాజు మళ్లీ వస్తున్నాడు! దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ని.. రెండు భాగాలను కలిపి, కొత్తగా ఎడిట్ చేసి, సరికొత్త సౌండ్ మరియు విజువల్స్ తో ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
ప్రభాస్ నట విశ్వరూపం, రాజమౌళి మేకింగ్ గ్రేట్‌నెస్ కలిగిన ఈ ‘ది ఎపిక్’ వర్షన్ అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐమాక్స్ , డాల్బీ వంటి ఫార్మాట్‌లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో, ప్రభాస్ అభిమానులు మరోసారి ‘మాహిష్మతి’ సామ్రాజ్యాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేయబోతున్నారు!
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nithiin-loses-three-big-films-after-flops/
అక్టోబర్ 23న కొత్త లుక్, అక్టోబర్ 31న పాత ఎపిక్ రీ-ఎంట్రీ! ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా పండుగ సీజన్!


