Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభFauji: రిలీజ్ డేట్ ఇదేనా..?

Fauji: రిలీజ్ డేట్ ఇదేనా..?

Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ సినిమాల తర్వాత భారీ చిత్రాలకి సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన నటించే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగులో ఫస్ట్ ఫాన్ ఇండియా ప్రభాస్ కావడంతో సినిమా సినిమాకి ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ప్రహా నుంచి చివరిగా ‘కల్కి 2898ఆడ్’ సినిమా వచ్చి మంచి సక్సెస్ ను సాధించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మారుతీ తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ది రాజా సాబ్’ ఈ సంవత్సరం డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటుగా ‘సీతారామం’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమై శరవేగంగా టాకీపార్ట్ జరుగుతోంది. అయితే, ఫౌజీ సినిమా నుండి డార్లింగ్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read – Singer Rohit: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సింగ‌ర్ – కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

ఈ నేపథ్యంలో.. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ కి సంబందించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. తాజాగా సమాచారం ప్రకారం, ప్రభాస్, హను రాఘవపూడి ల ఫౌజీ సినిమాను 2026 ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబందించి అఫీషియల్ గా కూడా అనున్స్ మెంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫౌజీ సినిమా పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో అలరించనున్నారు. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో జరిగిన కథగా ఫౌజీ సినిమాని నిర్మిస్తున్నారు. ధైర్యం, ప్రేమ, త్యాగం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుంని తెలుస్తోంది.

ఇక ఇందులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ ను ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ పక్కన ఛాన్స్ అంటే ఇలాంటి అదృష్టం మరొకరికి దక్కదు. చూడాలి మరి ఇమాన్వి ఎలాంటి క్రేజ్ ని ఈ మూవీతో సంపాదించుకుంటుందో. ఇక, ప్రభాస్.. సలార్ 2, కల్కీ 2, స్పిరిట్ లాంటి సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే, ది రాజాసాబ్ కి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్.

Also Read – Virat Kohli: నెరిసిన గడ్డతో కోహ్లీ.. షాక్ లో ఫ్యాన్స్..వైరల్ అవుతున్న పిక్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad