Prabhas Fauji: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఫౌజీ’ కి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం ఈ రోజు షేర్ చేసింది. కన్నప్పలో గెస్ట్ రోల్‌లో ప్రభాస్ కనిపించిన తర్వాత.. డార్లింగ్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కోసం హను రాఘవపూడి తీపి కబురు తీసుకొచ్చారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/dulquer-salmaan-kaantha-release-date-locked/
ఈ నెల 22న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ టీజర్ లేదా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా హను ప్రకటించారు. ‘#ప్రభాస్ హను డిక్రిప్షన్ 22.10.25న ప్రారంభమవుతుంది’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ వెనుక భాగంపైన బాణాలు గుచ్చుకున్నట్లుగా ఉంది. దీంతో ఫౌజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ ట్రైలర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9, 2026న రిలీజ్ కానుంది.
———————-
पद्मव्यूह विजयी पार्थः
———————-#PrabhasHanu DECRYPTION BEGINS ON 22.10.25 🔥#HappyDiwali ✨Rebel Star #Prabhas #Imanvi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/P7Lys2LmpW
— Hanu Raghavapudi (@hanurpudi) October 20, 2025


