Prabhas New Movie Update: ప్రజెంట్ టాలీవుడ్‌లో బిజీ హీరో ఎవరంటే అందరికి గుర్తొచ్చే మొదటి పేరు ప్రభాస్‌దే. ఈ పాన్ ఇండియన్ స్టార్ ప్రస్తుతం ఐదు సినిమాలు కమిటయ్యాడు. ఇందులో రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్‌లు జరుగుతోండగా.. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మొదలుపెట్టబోతున్నాడు ప్రభాస్. వీటి తర్వాత కల్కి, సలార్ సీక్వెల్స్ డేట్స్ కేటాయించనున్నట్లు సమాచారం.
అమరన్ డైరెక్టర్‌తో…
ఇదిలా ఉండగా ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామితో ప్రభాస్ ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పవర్‌ఫుల్ స్టోరీని ప్రభాస్‌కు డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి వినిపించినట్లు తెలిసింది. కోలీవుడ్ డైరెక్టర్ కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. అమరన్ తరహాలోనే యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన దేశభక్తి కథ ఇదని చెబుతున్నారు.
యూవీ క్రియేషన్స్…
స్క్రిప్ట్‌ను ఫుల్‌గా డెవలప్ చేసి మరోసారి తనను కలవమని దర్శకుడితో ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. సెకండ్ సెషన్ డిస్కషన్స్ తర్వాతే ఈ సినిమాపై క్లారిటీ రానున్నట్లు తెలిసింది. ప్రభాస్, రాజ్‌కుమార్ పెరియాసామి మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలిసింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలిసింది.
బిగ్గెస్ట్ హిట్…
అమరన్ మూవీతో గత ఏడాది డైరెక్టర్‌గా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు రాజ్‌కుమార్ పెరియసామి. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను హీరో కమల్ హాసన్ నిర్మించారు. తమిళంతో పాటు ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా అమరన్ నిలిచింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nani-koratala-shiva-film-locked-under-ajay-devgn-banner/
డిసెంబర్‌లో…
కాగా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రాజాసాబ్ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నది. సూపర్ నాచురల్ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహించాడు. మరోవైపు ఫౌజీ మూవీ హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీగా రూపొందుతోంది. 1940 నైజాం బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్టర్.


