Fauzi: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ప్రభాస్. హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా గురువారం రివీల్ చేశారు. ఈ సినిమాకు ముందు నుంచి ప్రచారంలో ఉన్న ఫౌజీ టైటిల్‌నే కన్ఫామ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రౌద్రంగా ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో బ్రిటీషర్ల జెండా మంటల్లో కాలిపోతూ కనిపిస్తుంది. పోస్టర్‌పై ఉన్న సంస్కృతం అక్షరాలు ఆసక్తిని పంచుతున్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సంస్కృత శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతడు పద్మవ్యూహాన్ని జయించిన అర్జునుడు, గురువు లేని ఏకలవ్యుడు… బ్రహ్మానుడి విజ్ఞానం, క్షత్రియుడి ధర్మం రెండు తెలిసిన యోధుడు అంటూ హీరో క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో ఈ శ్లోకం ద్వారా వివరించారు. చరిత్రలో మరుగున పడిన ఓ ధైర్యవంతుడైన సైనికుడి కథతో ఫౌజీ తెరకెక్కుతున్నట్లుగా ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా హిట్ ఇచ్చారు. ఒంటరిగా పోరాడే ఓ సైనికుడు అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
Also Read – Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నా – సెకండ్ ఇన్నింగ్స్‌పై బండ్ల గణేష్ కామెంట్స్
స్వాతంత్య్రం రాకముందు కాలం 1932 – 40 మధ్య నాటి కథతో ఫౌజీ మూవీ తెరకెక్కబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో సోల్జర్‌గా ప్రభాస్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. పాండవులు పక్షాన నిలిచిన కర్ణుడు అంటూ బుధవారం నాటి ప్రీ లుక్ పోస్టర్‌లో కొన్ని అక్షరాలు కనిపించాయి. గురువారం పోస్ట్ చేసిన సంస్కృతం శ్లోకాన్ని బట్టి మహాభారతంతో ఫౌజీకి లింక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 1932 నుంచి అందరూ అతడి కోసం వెతుకుతున్నారంటూ పోస్టర్‌లో చూపించారు. ఇవన్నీ చూస్తుంటే ఓ డిఫరెంట్ హిస్టారికిల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఫౌజీని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఫౌజీ మూవీ షూటింగ్ అరవై శాతానికిపైగా పూర్తయ్యింది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ హిస్టారికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫౌజీ మూవీలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఇమాన్వీ.
అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, జయప్రదతో పాటు పలువురు సీనియర్ యాక్టర్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫౌజీ మూవీని టీ సీరిస్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – Madonna Sebastian: హాట్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న మడోన్నా


