Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPrabhas: ప్రభాస్ సినిమాలో విలన్ గా ఖల్ నాయక్

Prabhas: ప్రభాస్ సినిమాలో విలన్ గా ఖల్ నాయక్

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సౌత్ సినిమాల్లో విలన్ గా సెటిల్ అయిపోయారు. భారీ బడ్జెట్ సినిమాల్లో, పెద్ద హీరోల సినిమాల్లో ఖల్ నాయక్ గా సంజూ బాబాను బుక్ చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నట్టు సమాచారం లీక్ అయింది. సౌత్ సినిమాల్లో పనిచేయటాన్ని తాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నానన్న సంజయ్ దత్, కేజీఎఫ్ తో ఇక్కడ సెటిల్ అయిపోయినట్టున్నారు. మరోవైపు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూనే తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో ఈయన బిజీ అవ్వటం విశేషం. ఈమధ్యనే ఇళయ దళపతి విజయ్ కొత్త సినిమాలోనూ సంజయ్ దత్ విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News