The Raja Saab Release date: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ జోనర్ మూవీ ఇప్పటికే పలు మార్లు విడుదలను వాయిదా వేసుకుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాను డిసెంబర్ 05న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని, సంక్రాంతికి షిఫ్ట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా స్పందించారు. అందరూ కోరుకున్నప్పుడే రాజాసాబ్ వస్తుందని, సంక్రాంతి రిలీజ్ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసినా ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వప్రసాద్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. కానీ డిసెంబర్ 05న సినిమా విడుదల కావాలంటే నవంబర్ చివరి వారంలోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ రిలీజ్ కష్టమేనని మేకర్స్ భావిస్తున్నారట.
సంక్రాంతి అడ్వాంటేజ్ సెలవుల వల్ల కలిగే అడ్వాంటేజ్‌ను వాడుకోవాలని రాజా సాబ్ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల మధ్యనే ‘ది రాజాసాబ్’ కొత్త విడుదల తేదీ ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ 05 నుంచి ఈ సినిమా 2026 జనవరి 09కి షిఫ్ట్ అయ్యిందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను పూర్వి పిక్చర్స్ భారీ ధరకు.. అంటే రూ.20 కోట్లకు దక్కించుకోవడం ద్వారా ఈ కొత్త రిలీజ్ డేట్ బయటకు లీక్ అయిందని తెలుస్తోంది.
దీంతో ‘ది రాజాసాబ్’ 2026 సంక్రాంతి బరిలో నిలుస్తుందని తెలుస్తోంది. అయితే సంక్రాంతి రేసులో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది, మొదటి నుంచీ దీని మేకర్స్ 2026 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ లెక్కన, 2026 సంక్రాంతికి ‘రాజాసాబ్’ వర్సెస్ మెగా 157 మధ్య భారీ పోటీ ఉండబోతుందని పరిశ్రమలో టాక్ నడుస్తుంది.
ఈ రెండు సినిమాలే కాకుండా ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి వైపే చూస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా సంక్రాంతి బరిపై దృష్టి సారించింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే, రవితేజ మరియు తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో ప్రారంభమైన మరో సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం దాని షూటింగ్ కూడా చకచకా నడుస్తోంది. చూడాలి మరి, ఈ రేసులో ఫైనల్‌గా ఎందరు ఉంటారు? ఎవరైనా డ్రాప్ అవుతారా? ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారా చూడాలి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/before-ntr-which-telugu-heroes-who-acted-in-bollywood-movies/


