Prashanth Varma: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అధీర, మహాకాళి, జై హనుమాన్‌తో పాటు బ్రహ్మరాక్షస్ సినిమాలను తమ బ్యానర్‌లో చేస్తానని 10.23 కోట్లు అడ్వాన్స్‌లు తీసుకొని ప్రశాంత్ వర్మ మాట తప్పాడని ఫిలిం ఛాంబర్‌లో హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ నుంచి తనకు 200 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ వివాదం పరిష్కారం అయ్యేంత వరకు ఇతర బ్యానర్స్‌లో ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాల నిర్మాణం ఆపేయాలని కూడా నిరంజన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చాడట.
నిరంజన్ రెడ్డి ఫిర్యాదుపై ప్రశాంత్ వర్మ కూడా ధీటుగానే స్పందించారు. హనుమాన్ లాభాల్లో తనకు రావాల్సిన వాటా ఎగ్గొట్టడానికే నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారని ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. అధీరా, జై హనుమాన్, మహాకాళి సినిమాలను తాను నిరంజన్ రెడ్డితో చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని, ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా లేవని అన్నారు. అధీర సినిమా టీజర్‌కు దర్శకత్వం వహించినందుకే తనకు కోటి ఇచ్చారని, సినిమా మొత్తం చేయడానికి ఇచ్చిన అడ్వాన్స్ అది కాదని ప్రశాంత్ వర్మ లేఖలో పేర్కొన్నారు. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి ఒకరిపై మరొకరు చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read- Sreeleela: ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన శ్రీలీల – ఆశలన్నీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌పైనే?
ఈ వివాదం ప్రశాంత్ వర్మ అప్‌కమింగ్ మూవీస్‌పై గట్టిగానే ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్న మహాకాళి, అధీర షూటింగ్ దశలో ఉన్నాయి. జై హనుమాన్‌తో పాటు ప్రభాస్‌తో చేయనున్న బ్రహ్మరాక్షస్ సినిమాలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా బ్రహ్మరాక్షస్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయడం ప్రభాస్‌కు ఇబ్బందిగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అదే టైమ్‌లో ప్రశాంత్ వర్మపై ఆరోపణలు రావడంతో ఈ మూవీ నుంచి ప్రభాస్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. డెబ్యూ మూవీ ఈశ్వర్ నుంచి ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు.
ఆరంభంలోనే బ్రహ్మరాక్షస్ మూవీపై ఈష్యూ కావడంతో ఈ సినిమాను పక్కనపెట్టాలని ప్రభాస్ ఫిక్సైనట్లు చెబుతున్నారు. బ్రహ్మరాక్షస్‌ను తొలుత రణవీర్‌సింగ్‌తో తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేశాడు. బాలీవుడ్ ప్లాన్స్ వర్కవుట్ కాకపోవడంతో కథలో మార్పులు చేసి ప్రభాస్‌తో డిస్కషన్స్ జరిపారు. నిరంజన్ రెడ్డితో వివాదం కారణంగా ప్రభాస్‌తో కూడా సినిమా తెరకెక్కడం అనుమానమేనని చెబుతున్నారు.
Also Read- Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, ‘డ్రాగన్’ మూవీ రెండు భాగాలుగా!
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.త్వరలోనే స్పిరిట్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 పూర్తి చేయాల్సివుంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.


