Prabhas: 2025లో ప్రభాస్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై చూడాలనే అభిమానుల కోరిక తీరలేదు. ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2025 మొత్తం షూటింగ్‌లతోనే గడిపేసిన ప్రభాస్ వచ్చే ఏడాది మాత్రం అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. 2026లో ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
సంక్రాంతికి రాజాసాబ్…
ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారు. కానీ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడితో సంక్రాంతికి ఈ సినిమా ఫిక్సయ్యింది.
హారర్ యాక్షన్ కామెడీగా రూపొందుతున్న రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. బ్యాలెన్స్‌గా మిగిలిన పాటలను ప్రస్తుతం గ్రీస్‌లో షూట్ చేస్తున్నారు. రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌తో పాటు రిద్దికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రాజాసాబ్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read – Mutton Soup: ‘మటన్ సూప్’ మూవీ రివ్యూ..
ఆగస్ట్‌లో ఫౌజీ…
రాజాసాబ్‌తో పాటు ప్రభాస్ మరో మూవీ ఫౌజీ కూడా వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. ఈ పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫౌజీ షూటింగ్ జెడ్ స్పీడ్‌లో సాగుతుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మరో 35 రోజులు మాత్రమే పెండింగ్‌లో ఉందట. వచ్చే ఏడాది వేసవిలోగా చిత్రీకరణ కంప్లీట్, ఆగస్ట్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 14న ఫౌజీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనుకున్న డేట్, టైమ్‌లోగా సినిమా పక్కగా రిలీజ్ అవుతుందని వార్తలొస్తున్నాయి.
ఇమాన్వీ హీరోయిన్…
అంతే కాకుండా ఫౌజీ మూవీకి ప్రీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచనలో కూడా దర్శకనిర్మాతలు ఉన్నట్లు చెబుతున్నారు. ఫౌజీ మూవీలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో మిథున్ చక్రవర్తి, జయప్రదతో పాటు పలువురు సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిష్తున్నారు. ఫౌజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Also Read – Priyanka Mohan: OG సాంగ్ నుంచి ప్రియాంక మోహన్ వైరల్ స్టిల్స్


