Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ మూవీ పోస్ట్‌పోన్ అంటూ కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానుండటంతో మరోసారి వాయిదా పడటం ఖాయమంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమర్స్‌పై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంగళవారం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. చెప్పిన డేట్‌కే జనవరి 9న రాజాసాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.
రాజాసాబ్ వాయిదా అంటూ వస్తోన్న వార్తలన్నీ నిరాధారమైనవని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాంటి డిలే లేకుండా శరవేగంగా జరుగుతున్నాయని అన్నది. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా ఉండబోతుందని వెల్లడించారు. “ఆడియెన్స్‌కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ప్రతి విభాగం కష్టపడుతుంది. పోస్ట్‌పోన్ రూమర్స్‌ను పట్టించుకోకుండా సంక్రాంతికి రాజాసాబ్‌తో థియేటర్లలో మొదలయ్యే సందడి కోసం ఎదురుచూడండి. త్వరలోనే ఎగ్జైటింగ్ అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాం” అని ఈ ప్రకటనలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.
“డిసెంబర్‌లో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాం. డిసెంబర్ 25 కల్లా ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో ప్రెస్టిజీయస్ మూవీగా రాజాసాబ్ ఉంటుంది” అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొన్నారు.
Also Read – Saiyami Kher: బికినీలో రచ్చలేపుతున్న బాలీవుడ్ బ్యూటీ
ఈ ప్రకటనతో అఫీషియల్‌గా రాజాసాబ్ పోస్ట్‌పోన్ రూమర్స్‌కు చెక్ పెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమా పోస్ట్‌పోన్ కావడం లేదని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. హారర్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజాసాబ్ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ నవంబర్ సెకండ్ వీక్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సంక్రాంతికి రాజాసాబ్‌తో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో పాటు రవితేజ – కిషోర్ తిరుమల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read – Sunny Leone: బికినీతో బీచ్‌కే చెమటలు పట్టించిన సన్నీ లియోన్!


