Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPrabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రాజాసాబ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ!

Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రాజాసాబ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ!

Prabhas: అనుకున్న‌దే జ‌రిగింది. ప్ర‌భాస్ రాజాసాబ్‌ మూవీ డిసెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రికి పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ విష‌యాన్ని నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. తేజా స‌జ్జా మిరాయ్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాజాసాబ్ రిలీజ్ డేట్‌పై నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబ‌ర్ 5న కాకుండా జ‌న‌వ‌రి 9న రాజాసాబ్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. రాజాసాబ్ పోస్ట్‌పోన్ కావ‌డం ఇది రెండోసారి. తొలుత ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు డిలే కావ‌డంతో డిసెంబ‌ర్ 5కి సినిమాను వాయిదావేశారు. తాజాగా మ‌రోసారి డిసెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రికి ఈ సినిమా పోస్ట్‌పోన్ కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతోన్నారు.

- Advertisement -

సంక్రాంతికి రిలీజ్ చేస్తే క‌లెక్ష‌న్స్ ప‌రంగా మంచి అడ్వాంటేజ్ అవుతుంద‌ని డిస్ట్రిబ్యూట‌ర్ల డిమాండ్ మేర‌కు సినిమాను జ‌న‌వ‌రికి రిలీజ్ డేట్‌ను మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు రాజాసాబ్ షూటింగ్ కూడా చాలానే బ్యాలెన్స్ ఉంద‌ట‌. ఓ మూడు పాట‌ల‌తో పాటు కొంత టాకీపార్ట్ పెండింగ్‌లో ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తోన్నారు. సెప్టెంబ‌ర్‌లో కేర‌ళ‌లో ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను షూట్ చేయ‌బోతున్నారు. అక్టోబ‌ర్‌లో మిగిలిన పాట‌ల షూటింగ్ కోసం చిత్ర యూనిట్ గ్రీస్‌కు వెళ్ల‌నుంద‌ట‌.

Also Read – Visakhapatnam : విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయుడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!

హార‌ర్ కామెడీ మూవీ…
రాజాసాబ్ మూవీకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ హార‌ర్ కామెడీ మూవీలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌తో పాటు రిద్దికుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రాజాసాబ్‌తో పాటు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఫౌజీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. హిస్టారిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్పిరిట్‌తో పాటు క‌ల్కి2, స‌లార్ 2 సినిమాలు అంగీక‌రించాడు ప్ర‌భాస్‌.

Also Read – Jaganmohan Rao : HCA మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావుకు బెయిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad