Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPRABHAS: 'స్పిరిట్'లో మెగా ట్విస్ట్! విలన్‌గా పాత బాలీవుడ్ హీరో, తండ్రిగా చిరంజీవి?

PRABHAS: ‘స్పిరిట్’లో మెగా ట్విస్ట్! విలన్‌గా పాత బాలీవుడ్ హీరో, తండ్రిగా చిరంజీవి?

SPIRIT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు మామూలు ఫామ్‌లో లేడు! ‘ది రాజా సాబ్’ ఒక పక్క రెడీ అవుతుంటే, మరోవైపు సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ గురించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సందీప్ రెడ్డి ఏం చేసినా సెన్సేషనే కదా! ఈసారి ప్రభాస్‌ని చూపించేది మాస్ గెటప్ లో కాదు. ఊర మాస్ అవతార్ లో !

- Advertisement -

ఇది అందరికి తెలిసిన విషయమే ‘స్పిరిట్’ కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే పేరు వినిపించింది. కానీ, అమ్మడు పెట్టిన కండిషన్లు, డిమాండ్లు చూసి సందీప్ కు చిర్రెత్తుకొచ్చి, ఎక్కువ చేస్తే తీసేయడమే అన్నట్టుగా. దీపికాను పక్కన పెట్టేసి, ఆమె స్థానంలో ఇప్పుడు హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు. త్రిప్తి రాకతో, ఈ సినిమాలో రొమాన్స్ డోస్ పీక్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/nagarjuna-100th-movie-title-lottery-king/

స్పిరిట్ లో విలన్‌గా ‘వినయ విధేయ రామ’

ప్రభాస్‌కి తగ్గ విలన్ కావాలి కదా! అందుకే, బాలీవుడ్ నుంచి మళ్ళీ ఓ పాత మొహాన్ని తీసుకురాబోతున్నాడు సందీప్.
రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో విలన్‌గా చేసిన వివేక్ ఒబెరాయ్ ని ‘స్పిరిట్’ లో ప్రభాస్ ముందు నిలబెట్టబోతున్నారట. ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయినా, వివేక్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్, సందీప్ కాంబోలో విలన్‌గా వస్తే, ఆ క్యారెక్టర్‌కి వేరే లెవల్ క్రేజ్ రావడం పక్కా.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/krithi-shetty-to-make-her-bollywood-debut-with-govinda-son-movie/

మెగా స్టార్ టచ్?

ఇక ఈ సినిమాకు హైప్ తీసుకువస్తున్న అతి పెద్ద అప్‌డేట్ ఏంటంటే… మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించబోతున్నారన్న న్యూస్ బాగా వినిపిస్తుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభాస్‌కి తండ్రిగా చిరంజీవి కనిపించే అవకాశం ఉంది. ఇది నిజమైతే, ఈ మెగా-రెబల్ కాంబో కోసం బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ.
నవంబర్ 5 నుంచి ఈ హై వోల్టేజ్ థ్రిల్లర్ షూటింగ్ మొదలవుతుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అంటే, ప్రభాస్ నుంచి ఇప్పటివరకు చూడని మాస్ అవతారం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad