Don Lee: కొంతకాలంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఒక్క విషయం.. అదే ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ లో కొరియన్ సూపర్ స్టార్ మా డాంగ్ సియోక్ (డాన్ లీ) నటిస్తున్నాడా లేదా అనేది!
‘ట్రైన్ టు బుసాన్’, ‘మార్వెల్ ఎటర్నల్స్’ లాంటి సినిమాలు చేసిన డాన్ లీ… స్పిరిట్ సినిమాతో ఇండియన్ సినిమాకు పరిచయం అవ్వడం కన్ఫర్మ్ అయినట్లు కొరియన్ మీడియా గట్టిగా చెబుతోంది. నిజానికి, డాన్ లీనే విలన్‌గా కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు! ఆ ప్రెజర్ వర్క్ అవుట్ అయింది అన్నట్టుగా ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది. దీనికి తోడు, రీసెంట్‌గా టాలీవుడ్ హీరోలు తరుణ్, శ్రీకాంత్ డాన్ లీతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవ్వడంతో.. ఈ రూమర్‌కు మరింత హైప్ వచ్చింది. ఆ ఫోటోలు చూసి, డాన్ లీ ‘స్పిరిట్’ కోసమే ఇండియాకు వచ్చారని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/rajinikanth-retirement-after-three-films/
కొరియన్ మీడియా ‘ముకో’ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న డార్క్ క్రైమ్ డ్రామాలో డాన్ లీ మెయిన్ విలన్‌గా నటిస్తాడు అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ స్పిరిట్ మూవీ టీం నుంచి మాత్రం ఈ విషయంలో అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు.
ప్రభాస్ బర్త్డేకి రిలీజ్ అయిన వాయిస్ గ్లింప్స్ లో అర్ధం అయిన దాని బట్టి ప్రకాష్ రాజ్, ప్రభాస్ వాయిస్ లు తప్ప మిగతా వాయిస్ లు ఎవరివి అన్నది ఏం తెలియలేదు. ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లు అయితే తృప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్. డాన్ లీ ఉన్నాడా, లేదా అనేది మూవీ టీం కన్ఫర్మ్ చేసే వరకు చెప్పలేం. స్పిరిట్ షూటింగ్ నవంబర్ లో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. డాన్ లీ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే మాత్రం, ఈ సినిమా రేంజ్ మామూలుగా ఉండదు!


