PRABHAS: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ వల్ల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ప్రారంభాన్ని మరికొన్ని నెలలు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ చేతిలో ఉన్న ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు పూర్తి కావాల్సి ఉండడంతో, ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ 2026 జనవరి లేదా మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/venkatesh-role-in-chiranjeevi-manasankar-varaprasad/
సందీప్ రెడ్డి వంగాకు ‘స్పిరిట్’ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే 25వ మైలురాయి చిత్రంగా రాబోతుంది. నిజానికి, ‘స్పిరిట్’ ప్రకటన వచ్చి చాలా కాలం అవుతోంది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాతో బిజీగా ఉన్న సమయంలో కూడా, ఈ సినిమా గురించి చాలాసార్లు ప్రస్తావించేవాడు. ‘యానిమల్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా, ‘స్పిరిట్’ను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సందీప్ చాలా కష్టపడుతున్నాడు అనే చెప్పాలి.
ప్రభాస్ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల, సందీప్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టాడు . ఒక రకంగా, ప్రభాస్ కోసం సందీప్ దాదాపుగా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తున్నాడు. ఇది అంత చూస్తుంటే స్పిరిట్ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకో నాలుగు నెలలు పట్టేలాగా ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/naga-vamsi-comments-on-loka-movie/
స్పిరిట్’లో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌తో ముగించి, ‘స్పిరిట్ 2’ కి లీడ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ‘యానిమల్’ సినిమాకు కూడా సీక్వెల్ యానిమల్ పార్క్ ప్లాన్ చేసినట్లే, ‘స్పిరిట్’ను కూడా ఒక పెద్ద యాక్షన్ ఫ్రాంచైజీగా లేదా ఒక సినిమాటిక్ యూనివర్స్‌గా మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


