Prabhas: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. సలార్, కల్కీ లాంటి పాన్ ఇండియా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సాలీడ్ హిట్స్ అందుకున్నారు ప్రభాస్. ఈ క్రమంలోనే మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నారు. వాటిలో ఒకటి ది రాజాసాబ్, కాగా మరో సినిమా ఫౌజీ. సలార్, కల్కీ సినిమాల మాదిరిగానే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడం విశేషం.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ అండ్ హర్రర్ జానర్ సినిమా ది రాజాసాబ్. ఇందులో ముగ్గురు హాట్ బ్యూటీస్ ప్రభాస్ సరసన సందడి చేస్తున్నారు. ట్రైలర్ లోనే ఈ ముగ్గురు ఎంత హాట్ గా కనిపించబోతున్నారో దర్శకుడు మారుతి హింట్ ఇచ్చారు. మాళవిక మోహనన్ కి సౌత్ లో గ్లామర్ బ్యూటీగా మంచి క్రేజ్ ఉంది. ఈ బ్యూటీకి తెలుగులో ది రాజాసాబ్ లాంఛింగ్ ఫిల్మ్ కావడం విశేషం. ఇక, ఇస్మార్ట్ బ్యూటీగా పాపులారిటీని తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం.
Also Read – Nbk 111: బాలకృష్ణ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ – నాలుగోసారి జోడీ కుదిరిందా?
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో నిధి, ది రాజాసాబ్ మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. అలాగే, మరో గ్లామర్ బ్యూటీ రిద్దీ కుమార్ కి ఇది మొదటి పాన్ ఇండియన్ సినిమా. సంజయ్ దత్ లాంటి వారు కీలక పాత్రలో నటించారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను చేస్తున్నారు.
అయితే, రాజాసాబ్ షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ నవంబర్ 8న షూటింగ్ మొదలవబోతుందట. ఈ షెడ్యూల్ ని 10 రోజులు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. కాకపోతే, ఈ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక, ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా.. వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read – Krithi Shetty: బెడ్ పై బేబమ్మ అందాల జాతర


