Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSpirit Movie: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్ - స్పిరిట్ గురించి ఈ విషయం తెలుసా?

Spirit Movie: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్ – స్పిరిట్ గురించి ఈ విషయం తెలుసా?

Spirit Movie: స్పిరిట్ మూవీ సెట్స్‌లోకి ప్ర‌భాస్‌ అడుగుపెట్టేది ఎప్పుడ‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కింగ్డ‌మ్ ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్‌ సందీప్ వంగా రివీల్ చేశారు. ప్ర‌భాస్‌, సందీప్ వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను అనౌన్స్‌చేసి రెండేళ్లు దాటిపోయింది. రెండు, మూడు నెల‌ల క్రితం వ‌ర‌కు స్పిరిట్‌కు సంబంధించి మేక‌ర్స్ నుంచి ఎలాంటి న్యూస్ రాక‌పోవ‌డంతో అస‌లు సినిమా ఉంటుందా? అనే డౌట్ అభిమానుల్లో మొద‌లైంది. ఫ్యాన్స్ డౌట్స్ క్లియ‌ర్ చేస్తూ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ను వెల్ల‌డిస్తూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌.

- Advertisement -

యానిమ‌ల్ బ్యూటీ…
స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి న‌టించ‌బోతున్న‌ది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా ప‌దుకోణ్‌, మృణాల్ ఠాకూర్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, సౌత్ టాప్ స్టార్ల పేర్లు వినిపించాయి. వారంద‌రినీ కాద‌ని త్రిప్తి డిమ్రికి అవ‌కాశ‌మిచ్చారు సందీప్ వంగా.

Also Read- Avatar 3 Trailer: ‘అవతార్ 3’ ట్రైలర్ వచ్చేసింది..జేమ్స్ కామెరూన్ విజువల్ మాయాజాలం

సెప్టెంబ‌ర్ నెలాఖ‌రున‌….
తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న డైరెక్ట‌ర్ సందీప్ వంగా స్పిరిట్ షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడ‌న్న‌ది వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు నుంచి స్పిరిట్ సెట్స్‌పైకి రానున్న‌ట్లు చెప్పాడు. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జ‌రుప‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌భాస్ ఎంట్రీ లేట్‌…
ప్ర‌భాస్ మాత్రం నెల రోజులు ఆల‌స్యంగా స్పిరిట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలిసింది. నిజంగా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అక్టోబ‌ర్ నెలాఖ‌రున లేదా న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి స్పిరిట్ షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ అవుతాడ‌ని అంటున్నారు. అప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్ లేకుండా మిగిలిన యాక్టర్లు క‌నిపించే సీన్స్‌ను సందీప్ వంగా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. స్పిరిట్‌లో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. గ‌త సినిమాల‌కు భిన్నంగా మోస్ట్ స్టైలిష్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ట‌.

సొంత బ్యాన‌ర్‌లో…
స్పిరిట్ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే మ్యూజిక్ సిట్టింగ్స్‌ దాదాపు పూర్త‌య్యాయ‌ట‌. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన హ‌ర్ష‌వ‌ర్ధన్ రామేశ్వ‌ర్ స్పిరిట్‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు. టీ సిరీస్‌తో క‌లిసి స్వీయ నిర్మాణ సంస్థ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ప‌తాకంపై సందీప్ వంగా స్వ‌యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read- Nabah Natesh: బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

హిస్టారిక‌ల్ ల‌వ్ స్టోరీ…
ప్ర‌స్తుతం రాజాసాబ్‌తో పాటు ఫౌజీ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్‌. రాజాసాబ్ డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. హార‌ర్ కామెడీ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిస్టారిక‌ల్ ల‌వ్ స్టోరీగా ఫౌజీ రూపొందుతోంది. సీతారామం ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న‌ ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad