Prabhas: ప్రభాస్ స్పిరిట్ మూవీని అనౌన్స్ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటివరకు షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ సెట్స్‌పైకి రానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవి పుకార్లుగానే మిగిలాయి. దాంతో ప్రభాస్ అభిమానులు చాలా డిజపాయింట్ అయ్యారు. ఈ ఏడాది ముగిసేలోగా అయినా స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందా? లేదా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి డౌట్‌కు ప్రభాస్ బర్త్‌డేతో ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతోన్నట్లు సమాచారం.
స్పెషల్ అప్‌డేట్…
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న స్పిరిట్ నుంచి స్పెషల్ అప్‌డేట్ రానుందట. ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అదే రోజు షూటింగ్ డీటెయిల్స్‌తో పాటు సినిమాలో విలన్ ఎవరు? రిలీజ్ ఎప్పుడనే ప్రశ్నలకు సమాధానాలు రావచ్చునని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ అప్‌డేట్‌ను రెడీ చేసే పనిలో డైరెక్టర్ సందీప్ వంగా ఫుల్ బిజీగా ఉన్నాడట.
పోలీస్ ఆఫీసర్‌గా…
కాప్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ సందీప్ వంగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా మోస్ట్ స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ సాగుతుందట. ఎమోషనల్‌గా కూడా చాలా డీప్‌గా ఉంటుందని అంటున్నారు.
త్రిప్తి డిమ్రి హీరోయిన్…
స్పిరిట్ మూవీలో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. తొలుత దీపికా పదుకొనెను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. కానీ సందీప్ వంగాతో మొదలైన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్‌లోకి అడుగు పెట్టకముందే దీపికా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని ఫైనల్ చేశారు సందీప్ వంగా.
Also Read- SSMB29: మహేష్‌బాబు, రాజమౌళి మూవీ టైటిల్ ఇదేనా? – ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే?
నేషనల్ అవార్డ్ విన్నర్…
స్పిరిట్‌లో కొరియన్ నటుడు డాన్ లీతో పాటు బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ విలన్లుగా నటించనున్నారని సమాచారం. స్పిరిట్ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీ సిరీస్‌తో కలిసి సందీప్ వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు ప్రభాస్. స్పిరిట్‌తో పాటు రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు కల్కి2, సలార్ 2, ప్రశాంత్ వర్మతో మరో సినిమా లైన్‌లో ఉన్నాయి.


