Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ చిత్రాలలో ది రాజాసాబ్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 2 పాటలు మాత్రమే మిగిలి ఉందని యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ పాటల కోసం తాజాగా ప్రభాస్ అండ్ టీమ్ ఎక్కడికి వెళ్ళింది..? రాజాసాబ్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా..? మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా..? పూర్తి కథనంలో చూద్దాం..
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తైనట్టు సమాచారం. ఇటీవల రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ ప్రభాస్ హర్రర్ జానర్ సినిమాలో నటించలేదు. కాబట్టి, కాన్సెప్ట్ ప్రకారం ప్రభాస్ ని మారుతి కొత్తగా చూపించడానికే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. హీరోయిన్‌గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు.
Also Read – Pawan Kalyan: 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రేర్ ఫీట్ – టాలీవుడ్‌లో ఈ ఏడాది కలెక్షన్స్‌లో ఓజీ టాప్
అంతకుముందు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ లలో చూస్తే హీరోయిన్ ని చాలా గ్లామర్‌గా చూపిస్తున్నాడని ఓ క్లారిటీ వచ్చింది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హర్రర్ అండ్ కామెడీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా 2026, జనవరి 9న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఇందులో మిగిలి ఉన్న రెండు పాటల చిత్రీకరణకి ప్రభాస్ అండ్ టీమ్ యూరప్ కి చేరుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత ఎస్‌కేన్ సోషల్ మీడియాలో ఓ పిక్ ని షేర్ చేసి తెలిపారు.
యూరప్ లో రెండు పాటలను పూర్తి చేస్తే, దాదాపు ది రాజాసాబ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టే. వీఎఫెక్స్ వర్క్ ఇందులో మేయిన్ హైలెట్‌గా నిలవబోతోంది. దీనికోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రాన్ని పూర్తి చేసి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి రెడీ అవుతాడు. ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం కాబోతోంది.
Also Read – Bihar Elections: నేడే బిహార్ ఎన్నికల షెడ్యూల్.. సాయంత్రం ఈసీ ప్రెస్‌మీట్!


